కొడాలి నాని 'రాజకీయం' ... వెనక్కి తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ !

రాజకీయాలంటే… ఆషామాషీ కాదు.ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా…ఖచ్చితంగా దానివెనుక చాలా లెక్కలు ఉంటాయి.

 Jr Ntr Tdp Turns Back Through The Kodali Nanis Speech-TeluguStop.com

ముందూ వెనుకా ఆలోచించకుండా… ఎలా బడితే అలా రాజకీయ అడుగులు వేస్తే….ఆ తరువాత ఇబ్బందులు పడాల్సిందే.

అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నే ప్రాతిపదికగా తీసుకుంటే… ఎన్టీఆర్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా… టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన ఓ రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా….ముందుగా మేల్కొనడంతో జూనియర్ ఎన్టీఆర్ చాలా సేఫ్ అయ్యాడు.

తెలంగాణాలో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి ఘోర పరాజయం చెందింది.అలాగే టీడీపీ ప్రతిష్టాత్మకంగా.తీసుకుని మరీ ప్రచారం నిర్వహించిన కూకట్ పల్లి నియోజకవర్గంలో కూడా ఘోరంగా దెబ్బతింది.అయితే ముందుగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ నందమూరి ఆడపడుచు సుహాసిని కి ఆమె సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని… అంతా తానై వ్యవహరిస్తాడని… అంతా భావించారు.

దీనిపై మీడియా లో అనేక కథనాలు కూడా వచ్చాయి.కానీ ఆ విషయంలో ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉండిపోయాడు.

సుహాసిని నామినేషన్ వేసిన దగ్గర నుంచి అదిగో వస్తున్నాడు… ఇదిగో వస్తున్నాడు అంటూ… టీడీపీ లీకులిచ్చింది.జూనియర్ వస్తే… ఆయన ఫ్యాన్స్ అంతా… సుహాసిని మద్దతుగా నిలబడతారని టీడీపీ ఆశలు పెట్టుకుంది.సుహాసిని కూడా ఇదే భావించింది.కానీ… ఈ విషయంలో జూనియర్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ప్రచారానికి రాకపోగా.కనీసం ఎన్నికలకు ముందు ఆయన తన అభిమానులకు ఓ ప్రకటన రూపంలోనూ మద్దతివ్వా లని కోరలేదు.దీంతో టీడీపీకి… సుహాసినికి మద్దతు పలకడానికి జూనియర్ ఇష్టపడడంలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అయినా ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా దీనిమీద స్పందించలేదు.

అయితే జూనియర్ ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉండడం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయని దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుడైన ఓ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆలస్యంగా కొన్ని వార్తలు ఇప్పుడు బయటకి వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్ తో అనేక సినిమాలు నిర్మించిన కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరావు ( నాని ) సూచనలతోనే జూనియర్ కూకట్‌పల్లిలో కలుగజేసుకోలేదని సమాచారం.తెలంగాణాలో టీఆర్ఎస్… పరిస్థితిపై సర్వే చేయించిన నాని.అక్కడి తిరిగి ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనితేలడంతో… తెలంగాణ రాజకీయాల్లో ఎన్టీఆర్ ని వేలుపెట్టొద్దని సూచించాడట.అంతే కాదు కూకట్ పల్లిలో కూడా తిరిగి టీఆర్ఎస్ అధికారం దక్కించుకోబోతుంది అంటూ ఫలితాన్ని ముందుగానే నాని చెప్పేశాడట.దీంతో….జూనియర్ వెనక్కి తగ్గినట్టు సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ కూకట్ పల్లిలో తన సోదరి కోసమైనా… ఎన్నికల ప్రచారానికి వస్తాడని…దాని ద్వారా తెలంగాణ… ఏపీలో ఆ ప్రభావం కనిపిస్తుందని… బాబు స్కెచ్ వేసాడని… ఆ స్కెచ్ లో ఇరుక్కోవద్దని …ఆశలు చంద్రబాబు అంటేనే… అవకాశవాదానికి మారుపేరని నాని చెప్పడంతో గతంలో తనకు జరిగిన కొన్ని అవమానాలను గుర్తు చేసుకున్న ఎన్టీఆర్ ఈ విషయంలో మొహమాటలను కూడా పక్కనపెట్టి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube