బుచ్చిబాబు కోసం ఎన్టీఆర్ ఆ సాహసం చేయబోతున్నాడా?

ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా విజయం గురించి అందరికీ తెలిసిందే.మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటీనటులుగా నటించిన ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది.

 Junior Ntr Says Ok To Director Bucchi Babu Story To Act As 60 Year Old Man , Jr-TeluguStop.com

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి స్పందన రాగా.ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు మరో సినిమా కథలు చాలా మంది హీరోలకు వినిపించారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఏ హీరో కథ విషయంలో ఫైనల్ విషయానికి రాకపోగా.తాజాగా బుచ్చిబాబు చెప్పిన కథకు ఎన్టీఆర్ ఓకే అన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 గా రూపుదిద్దుకున్న సినిమాలో నటించనున్నాడు.

ఇక బుచ్చిబాబు వినిపించిన కథ నచ్చడంతో అందులో ఎన్టీఆర్ 60 ఏళ్ళ వృద్ధుడి గా కనిపించనున్నాడని వార్తలు వినిపించగా.అధికారికంగా ప్రకటన చేయలేదు.

Telugu Buchi Babu, Jr Ntr, Ntrbucchi, Ntr Bucchi Babu, Ntr, Rajamouli, Tollywood

కానీ ఈ సినిమాకు బుచ్చిబాబు కాస్త ఆగాల్సి వస్తుందేమో.ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టానున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమాలు పూర్తయ్యేసరికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని తెలుస్తుంది.ఇక బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం తీసుకున్న కథను ఎన్టీఆర్ తోనే చేయించనున్నాడా లేక మరి ఎవరితో నైనా చేయనున్నాడా అని గందరగోళం ఎదురవ్వగా.60 ఏళ్ళ పాత్ర ఎన్టీఆర్ కు సెట్ అవ్వగా బహుశా ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యేవరకు బుచ్చిబాబు కాస్త ఆగుతాడేమో అని అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube