Rajinikanth : రజనీకాంత్ బర్త్ డే రోజున ట్రెండింగ్ అవుతున్న ఎన్టీఆర్ పేరు.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

నేడు అనగా డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అభిమానులు ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

కాగా రజినీకాంత్ కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఈ మధ్య మొదలయ్యి సినిమా హీరోలుగా మారారు కానీ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి.

హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని బాషల్లో రజినీకాంత్ సినిమా స్ట్రెయిట్ మూవీ గానే రిలీజ్ అవుతుంది.డబ్బింగ్ మూవీగా రిలీజ్ అవ్వకుండా హైప్ తో ఆడియన్స్ ముందుకి వస్తుంది.ప్రతి రజినీకాంత్ సినిమా పాన్ ఇండియా సినిమాగానే థియేటర్స్ లోకి వస్తుంది.

రీజనల్ మార్క్స్ ని ఎప్పుడో దాటేసిన రజినీకాంత్ బర్త్ కావడంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అదేంటి? రజినీకాంత్ బర్త్ డే కి ఎన్టీఆర్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు ప్రతి రజినీకాంత్ బర్త్ డేకి ఎన్టీఆర్ ( NTR )పేరు ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఎందుకంటే రజినీకాంత్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రాండ్ గా బర్త్ విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిన చాలా మంది రజినీకాంత్ కి కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు.ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా ఉండదు.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి రజినీకాంత్ కి స్పెషల్ విషెస్ వచ్చాయి కానీ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఇంకా ట్వీట్ రాలేదు.ఇప్పుడే మ్యూచువల్ ఫ్యాన్స్ సందడి ఈ రేంజ్ లో ఉంటే ఇక ఎన్టీఆర్ నుంచి ట్వీట్ వస్తే సోషల్ మీడియాలో హంగామా మాములుగా ఉండదేమో.

Advertisement

తాజా వార్తలు