‘అరవింద సమేత’లో బుడ్డోడు ఉంటాడట.. ఫ్యాన్స్‌కు పండగే పండగ!     2018-10-07   12:41:26  IST  Ramesh P

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాను వారం రోజుల ముందే ఈ చిత్రం తీసుకు వస్తుందనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 100 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు చాలా నమ్మకంతో ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చిన్నప్పటి పాత్రను అభయ్‌ రామ్‌తో చేయించినట్లుగా తెలుస్తోంది. రెండు మూడు నిమిషాల సమయం పాటు అభయ్‌ రామ్‌ కనిపిస్తాడని, అయితే అభయ్‌ రామ్‌కు ఎలాంటి డైలాగ్స్‌ ఉండవని, కేవలం కొన్ని షాట్స్‌కు పరిమితం అవుతాడు అంటూ సమాచారం అందుతుంది. ఎంత సమయం కనిపించినా కూడా అభయ్‌ సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌లో అభయ్‌ రామ్‌ పాల్గొన్నాడు అనేందుకు సాక్ష్యం మేకింగ్‌ వీడియోలో అతడు ఉండటమే అంటూ కొందరు అంటున్నారు. అయితే జనతాగ్యారేజ్‌ మేకింగ్‌ వీడియోలో కూడా అభయ్‌ ఉంటాడు. మరి ఆ చిత్రంలో లేడు కదా అంటూ కొందరు లాజిక్‌ను వెదుకుతున్నారు. మొత్తానికి అభయ్‌ ఉంటాడా లేదా అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ తనయుడు బుడ్డోడు అభయ్‌ ఉంటే ప్రేక్షకులకు పండగే, లేదంటే ఎన్టీఆర్‌ ఎలాగూ ఉన్నాడు కదా అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.