సుమపై మండిపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కళ్లతోనే గుర్రుగా హెచ్చరిస్తూ?

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్.ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

 Jr Ntr Serious Reaction On Anchor Suma At Amigos Movie Pre Release Event , Amigo-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాల గురించి అలాగే తన 30వ సినిమాకు సంబంధించిన విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎన్టీఆర్ తన స్పీచ్ ఇవ్వడం కంటే ముందుగా యాంకర్ సుమపై కాస్త సీరియస్ గా చూశాడు.ఈ ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరిస్తున్న యాంకర్ సుమ ఎన్టీఆర్ మాట్లాడటం కంటే ముందుగా ఎన్టీఆర్ కు మైక్ ఇవ్వబోతూ ఎన్టీఆర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ ను కూడా మనకు చెప్పబోతున్నారు అని అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా ఎన్టీఆర్ సుమ వైపు కోపంగా చూస్తుండడంతో కళ్యాణ్ రామ్ తమ్ముడికి సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేశాడు.ఆ తర్వాత ఎన్టీఆర్ కీ మైకు ఇవ్వగానే మైక్ అందుకున్న వెంటనే ఎన్టీఆర్ చాలా సీరియస్ గా వాళ్ళు అడక్కపోయినా.

మీరు చెప్పేసేలా ఉన్నారు అంటూ సుమ మాటలకు సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ అమిగోస్ సినిమా ఘనంగా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో తన 30 వ సినిమా అప్డేట్ గురించి అడుగుతూ ఒత్తిడి చేయడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు అనిపించింది.

ఈ నేపథ్యంలోని ఎన్టీఆర్ మాట్లాడుతూ.ఫ్యాన్స్ సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు.అప్డేట్ అడుగుతూ ఉంటే కొన్నిసార్లు నిర్మాతలు దర్శకుడు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురి అవుతున్నారు.ఇది నేను మా గురించి చెప్పడం లేదని దాదాపు ఇండస్ట్రీలో అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బంది అని అన్నారు.

మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాము.అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సరైన టైమ్ లో ఇస్తాము.

మా బార్యల కంటే ముందు మీకే చెబుతాము చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube