జూ.ఎన్టీఆర్ సంచలన నిర్ణయం..

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి తెలంగాణా ఎన్నికలు.కేసీఆర్ విజయం కూటమి కట్టిన పార్టీలపై భవిష్యత్తులో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతని ఎదుర్కునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

 Jr Ntr Sensational Decision On Tdp Party-TeluguStop.com

ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ఘోరమైన వైఫల్యం తప్పదనే అంటున్నారు.ఇదిలాఉంటే చంద్రబాబు తాను చెడింది కాకుండా ఈ తెలివిగా నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ ని సైతం హైదరాబాదు వేదికగా పొలిటికల్ ఫీల్డ్ లోకి దింపి పరువు పోగొట్టుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్క కోసం ప్రచారం చేస్తారని అది తన భాద్యత అంటూ పచ్చ మీడియా పదేపదే ప్రకటనలు చేసినా సరే ఎన్టీఆర్ ఎక్కడా తొందర పడలేదు కేవలం అన్నదమ్ములు ఇద్దరూ శుభాకాంక్షలతో సరిపెట్టేశారు.ప్రచారానికి కేవలం బాలయ్య మాత్రమే వెళ్ళి తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ మొత్తానికి సుహాసినిని ఓటమి వరకూ పయనం అయ్యేలా చేశారు.అప్పట్లోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రచారానికి ఎన్టీఆర్ ని వెళ్ళడకండి అంటూ ట్వీట్ చేయడం అందరికి తెలిసిందే అయితే.

ఎన్టీఆర్ అప్పటికే ప్రచారానికి వెళ్ళకూడదు అనే ఒక క్లారిటీ తో ఉన్నాడని.

అయితే తెలంగాణలో ఎన్నికలు టీడీపీ కి ఇచ్చిన షాక్ ని గమనించిన ఎన్టీఆర్, ఏపీలో జరగబోయే ఎన్నికల విషయంలో పూర్తి క్లారిటీకి వచ్చేశాడని తెలుస్తోంది.ఎందుకంటే రానున్నవి ఏపీ ఎన్నికలు టీడీపీ చావోరేవో అనే ఎన్నికలు కావడంతో ఇప్పుడు చంద్రబాబు తో సహా పార్టీ ముఖ్య నేతలు అందరూ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వారికి ససేమిరా అనే సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడట ఎన్టీఆర్.ఎందుకంటే

తనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది.భవిష్యత్తులో రాజకీయాల్లో గెలుపొండాలి అంటే ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీలో ప్రచారానికి వెళ్ళే ప్రయత్నాలు చేయద్దు అంటూ హెచ్చరికలు చేస్తున్నారట సన్నిహితులు దాంతో ఎన్టీఆర్ ఇంటి బయట నో ఎంట్రీ బోర్డు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube