లైగర్ సహా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన.. ఫ్లాప్ సినిమాల లిస్టు ఇదే?

సాధారణంగా స్టార్ హీరోల దగ్గరికి ఎంతో మంది దర్శకులు సినిమాలు చేయాలని కథలు వినిపించడానికి వస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఏ సినిమా చేయాలన్నది మాత్రం అటు హీరోలే ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

 Jr Ntr Rejected Movies Turned Flop , Jr Ntr, Rejected Movies, Liger , Vijay Dev-TeluguStop.com

ఒకవేళ కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని భావిస్తే సినిమా చేయడానికి ఓకే చెప్తారూ.లేదంటే ఏదైనా తేడాగా అనిపిస్తే ఇక నిర్వాహమాటంగా మొఖం మీద నో చెప్పేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయట.అయితే జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా మటుకు ఫ్లాప్ అయ్యాయి అన్నది తెలుస్తుంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లైగర్ :

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లైగర్.బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ సినిమా భారీ అంచనాల మధ్య దొరకకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిపోయింది.చివరికి నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.అయితే ఈ సినిమా మొదట ఎన్టీఆర్ వద్దకే రాగా స్టోరీ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడట.

నా పేరు సూర్య :

అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నా పేరు సూర్య.ఈ సినిమా ఆఫర్ మొదట ఎన్టీఆర్ వద్దకే వచ్చింది.

ఇక ఈ కథను విన్న ఎన్టీఆర్ ఎందుకో కథలో బలం లేదని నమ్మాడు.ఈ క్రమంలోనే చివరికి సినిమా చేయను అని చెప్పేసాడట.

ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా చేసి చివరికి ప్లాన్ చవిచూశాడు.

బ్రహ్మోత్సవం :

వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబుకు బ్రేక్ వేసింది బ్రహ్మోత్సవం సినిమా.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.అయితే ముందుగా ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వస్తే రిజెక్ట్ చేశాడట.

శ్రీనివాస కళ్యాణం

: యువ హీరో నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం అనే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయింది.అయితే ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించగా అతను రిజెక్ట్ చేశాడట.ఇలా ఎన్టీఆర్ కొన్ని సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తపడి రిజెక్ట్ చేయగా ఇక ఎన్టీఆర్ ఊహించినట్లుగానే ఆ సినిమాల ఫలితం రావడం గమనార్కం.ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఆ సినిమాలు చేయకపోవడమే మా అభిమాన హీరో ఎన్టీఆర్ కు మంచిదయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube