ఆర్ఆర్ఆర్ లో ఆరు గెటప్స్ లో కనిపంచనున్న ఎన్టీఆర్  

Jr NTR Presence Six Different Looks in RRR Movie, Tollywood, Rajamouli, Ram Charan, Nandamuri Fans, Mega Fans - Telugu Jr Ntr Presence Six Different Looks In Rrr Movie, Mega Fans, Nandamuri Fans, Rajamouli, Ram Charan, Tollywood

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా డివివి దానయ్య నిర్మాతగా భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫిక్షన్ కథనంతో అల్లూరి సీతారామరాజు, కొమరాం భీమ్ పాత్రలతో సినిమాని ఆవిష్కరిస్తున్నారు.

 Jr Ntr Presence Six Different Looks In Rrr Movie

ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇందులో రామ్ చరణ్ కి జోడీగా కనిపించబోతుంది.ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ సందడి చేస్తుంది.

ఆర్ఆర్ఆర్ లో ఆరు గెటప్స్ లో కనిపంచనున్న ఎన్టీఆర్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇందులో అజయ్ దేవగన్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కి గురువుగా కనిపిస్తారని తెలుస్తుంది.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

అడవిలో ఉంటూ బ్రిటిష్ సైన్యంపై పోరాటం చేస్తున్న కొమరాం భీమ్ శత్రువులు త‌న‌ని గుర్తు పట్టకుండా ఉండటానికి తరుచుగా వేషాన్ని మారుస్తూ ఉంటాడని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో ఆరు రకాలుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఆరు డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని విపరీతంగా అలరించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.అలాగే ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని, గూస్ బాంబ్స్ తరహాలో భీమ్ డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం.

సాయి మాధవ్ బుర్రా ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డైలాగ్స్ ని రాసినట్లు చెప్పుకుంటున్నారు.మొత్తానికి తాజాగా ఎన్టీఆర్ పాత్ర గురించి వినిపిస్తున్న ఈ న్యూస్ నందమూరి అభిమానులకి కాస్తా ఉత్సాహాన్ని అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

#Ram Charan #Mega Fans #Nandamuri Fans #Rajamouli #JrNTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jr Ntr Presence Six Different Looks In Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..