అసురన్ దర్శకుడుతో ఎన్టీఆర్ కల్ట్ మూవీ!  

Jr Ntr Plan To Cult Movie With Asuran Director-jr Ntr Plan To Cult Movie,kollywood,nandapuri Fans,tollywood

వెట్రి మారన్… ఈ పేరు ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా వినిపిస్తుంది.సహజమైన కథలని తెరపై అంతే సహజంగా ఆవిష్కరించి అందులో ఎమోషన్స్ ని పండించే దర్శకుడుగా వడ చెన్నై, అసురన్ సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు.

Jr NTR Plan To Cult Movie With Asuran Director-Jr Ntr Kollywood Nandapuri Fans Tollywood

ఈ రెండు సినిమాలు ధనుష్ హీరోగా నటించి నిర్మించినవే.ఇక గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన అసురన్ సినిమా తమిళనాడు లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

బలహీన వర్గాలకి చెందిన వారు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇందులో చాలా హృద్యంగా దర్శకుడుగా ఆవిష్కరించాడు.ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతుంది.

మరో వైపు బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అయితే అసురన్ లాంటి రా మూవీలో నటించాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నాడు.

జైలవకుశలో ఆ తరహాలో కొద్దిగా ట్రై చేసిన అది పూర్తిగా కమర్షియల్ వేలోకి వెళ్ళిపోయింది.అయితే పూర్తిగా విలేజ్ నేటివిటీతో రంగస్థలం తరహాలో కల్ట్ కంటెంట్ తో కమర్షియల్ హిట్ కొట్టి నటుడుగా తనలో మరో కోణాన్ని చూపించాలని భావిస్తున్న ఎన్టీఆర్ దృష్టిలో అసురన్ దర్శకుడు వెట్రి మారన్ పడ్డాడు.

దీంతో అతన్ని లైన్ లోకి తీసుకొని సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.తారక్ అడగడంతో మారన్ కూడా ఫుల్ ఖుషీ అయ్యి మంచి కథని సిద్ధం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసుకొని ఎన్టీఆర్ ఈ వెట్రి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలని భావిస్తున్నట్లు సమాచారం.

.

తాజా వార్తలు

Jr Ntr Plan To Cult Movie With Asuran Director-jr Ntr Plan To Cult Movie,kollywood,nandapuri Fans,tollywood Related....