కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని కేజీలు పెరిగారా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.ఎలాంటి పాత్రలోనైనా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే నటుడిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు.

 Jr Ntr Opens Up How He Trained For Komaram Bheem Role-TeluguStop.com

తాజాగా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీమ్ రోల్ గురించి స్పందిస్తూ ఆ పాత్ర కోసం పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు.కొమరం భీమ్ లుక్ కోసం 18 నెలలు కష్టపడ్డానని ఎన్టీఆర్ తెలిపారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొరకు నిర్మాత దానయ్య ఏకంగా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

 Jr Ntr Opens Up How He Trained For Komaram Bheem Role-కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని కేజీలు పెరిగారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా ఆరోజు రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటిస్తుందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా కథ విన్న సమయంలో 71 కేజీల బరువు ఉన్న ఎన్టీఆర్ మజిల్ బాడీ కోసం ఏకంగా 9 కేజీలు పెరిగారని సమాచారం.ఎన్నో కఠినమైన కసరత్తులు చేసి ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.మరోవైపు ఈ నెల 10వ తేదీన కరోనా సోకినట్టు ప్రకటించిన ఎన్టీఆర్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.ఎన్టీఆర్ కొరటాల శివ మూవీకి సంబంధించి కీల్ విషయాలను వెల్లడించారు.

పాన్ ఇండియా మూవీగా కొరటాల శివ మూవీ తెరకెక్కనుందని తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజవుతుందని ఎన్టీఆర్ వెల్లడించారు.ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా కథలలో నటిస్తూ ఉండటం గమనార్హం.

#9kgs #71 Kgs Weight

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు