హాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్.. ఆ హీరోలకు ఝలక్.?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానిస్తున్నారనే సంగతి తెలిసిందే.గత కొన్నేళ్ల నుంచి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఎన్టీఆర్ అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

 Jr Ntr Movie With Hollywood Director Manoj Night Shyamalan, Ntr, Hollywood,direc-TeluguStop.com

చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

త్రివిక్రమ్ మూవీ తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకులతో పాటు హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కూడా నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ద సిక్స్త్ సెన్స్, అన్ బ్రేకబుల్, గ్లాస్ సినిమాలను తెరకెక్కించిన మనోజ్ నిజంగానే ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కిస్తారో లేదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎన్టీఆర్ మనోజ్ కాంబినేషన్ పట్టాలెక్కితే మాత్రం ఎన్టీఆర్ మార్కెట్ అంచనాలకు అందని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంతో మంది స్టార్ హీరోలు ట్రై చేస్తుంటే ఎన్టీఆర్ హాలీవుడ్ మూవీలో నటిస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

Telugu Manoj Shyamalan, Hollywood, Rrr-Movie

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తుండగా ఈ సినిమా విడుదలైతే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.దసరా పండుగ కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube