అందరికి శివనే కావాలి అంటే ఎలా బాస్‌..?  

Jr Ntr, Mahesh And Chiranjeevi Wants To Koratala Siva-chiranjeevi 152th Movie,jr Ntr,koratala Siva,mahesh,telugu Movie News

మొదటి సినిమా ‘మిర్చి’ నుండి కూడా కొరటాల శివ సక్సెస్‌లతోనే కొనసాగుతున్నాడు. రచయితగా కెరీర్‌ను ఆరంభించిన కొరటాల శివ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. మొదటి సినిమా మిర్చి సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ తర్వాత మహేష్‌ బాబుతో శ్రీమంతుడు తీసే అవకాశం దక్కింది. ఆ తర్వాత చేసిన జనతా గ్యారేజ్‌ మరియు భరత్‌ అనే నేను చిత్రాలు కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్నాయి..

అందరికి శివనే కావాలి అంటే ఎలా బాస్‌..?-Jr Ntr, Mahesh And Chiranjeevi Wants To Koratala Siva

దాంతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా కొరటాల శివపై ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన దర్శకత్వంలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్‌ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే కొరటాల దర్శకత్వంలో సినిమా చేయాలని మహేష్‌ అనుకున్నాడు. అందుకోసం కొరటాల డేట్లను కూడా పరిశీలించారట.

తాజాగా ఎన్టీఆర్‌ కూడా ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తర్వాత కొరటాల దర్శకత్వంలో చేయాలని ఆశ పడుతున్నాడు. అందుకోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు..

కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి 152వ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఆ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం అవ్వబోతుంది.

చిరంజీవితో సినిమా తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేస్తాడనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. కొరటాలతో సినిమా చేసేందుకు రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌లు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి వీరిలో ఎవరికి కొరటాల ఛాన్స్‌ ఇస్తాడో చూడాలి.