జక్కన్నకు తెలిస్తే గొడ్డలితో వస్తాడు.. ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు...

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ హిట్ తరువాత ఆర్‌ఆర్‌ఆర్‌ మినహా మరే కొత్త సినిమాకు కమిటవలేదు.అంతర్జాతీయ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ కొరకు ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలతో హాలీవుడ్ వెబ్ సైట్లకు ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు.

 Jr Ntr Comments About Rrr Movie In An Interview, Ntr, Rrr Movie, Ntr About Rrr-TeluguStop.com

ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా మూవీ అనే వర్డ్ తనకు అస్సలు నచ్చదని తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని పాన్ ఇండియా మూవీ అనకుండా భారతీయ మూవీ అని పిలిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వల్ల కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మాత్రం ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు.పాన్ అనే వర్డ్ వింటే తనకు వంటపాత్ర గుర్తుకు వస్తుందని విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను థియేటర్లలోనే చూడాలని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

Telugu Jr Ntr, Jrntr, Ntr Rrr, Rajamouli, Rrr-Movie

రాజమౌళి టాలెంటెడ్ డైరెక్టర్ అని అక్టోబర్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను రిలీజ్ చేయడానికి ఇప్పటికీ అవకాశాలు అయితే ఉన్నాయని తారక్ పేర్కొన్నారు.తనకు సినిమాలు చేయాలనే ఆలోచనే తప్ప డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేదని ఎన్టీఆర్ అన్నారు.కథ నచ్చితే నిర్మాతగా మారడానికి మాత్రం తనకు అభ్యంతరం లేదని ఎన్టీఆర్ వెల్లడించారు.తన ఇంటర్వ్యూను రాజమౌళి చదివితే గొడ్డలి తీసుకొని వెంటబడే అవకాశం ఉందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని ఈ సినిమా మరో బాహుబలి అవుతుందనే నమ్మకం అయితే తనకు ఉందని ఎన్టీఆర్ అన్నారు.జక్కన్న లాంటి ఆత్మీయుడు తనకు ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

మరి ఎన్టీఆర్ భావిస్తున్నట్టు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ దసరాకే విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube