తెలుగుదేశానికి ప్రచారం చేస్తాం...కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ స్పష్టం     2018-04-12   23:26:16  IST  Bhanu C

-

-

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నేతలకి నెలకొన్న సందేహం ఇన్నాళ్ళకి తీరిపోయింది..నందమూరి ఫ్యామిలీ లో లుకలుకలు ఉన్నాయి హరి కృష్ణ మరియు తన తనయులు జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అంటూ వస్తున్నా వార్తలకి కళ్యాణ్ రామ్ చెక్ పెట్టారు..మా సపోర్ట్ తప్పకుండా తెలుగుదేశం పార్టీ కి ఉంటుందని చంద్రబాబు కి 2019 మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు..దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు..ఎందుకంటే..

2009 ఎన్నికలలో అచ్చం తాతలాగే ఖాకీ బట్టలు వేసుకుని బస్సు యాత్ర చేస్తూ ప్రచారం మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలనం సృష్టించింది ఈ విషయం అందరికీ తెలిసిందే..అయితే ఆ తరువాత జూనియర్ ని పక్కనే పెట్టేశారు పట్టించుకోలేదు అంటూ ప్రచారం జరిగింది దానికి తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేదు..ఆ తరువాత సినిమాలలో బిజీ బిజీ అయిపోయిన ఎన్టీఆర్ చంద్రబాబుకి దూరంగానే ఉంటూ వచ్చారు..మీడియాలో సైతం చంద్రబాబు కి ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం కూడా జరిగింది..ఇదిలాఉంటే..

-

-


తాజాగా టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి..టాలీవుడ్ మొత్తం టిడిపి ని బహిష్కరించాలి అని ఫిక్స్ అయ్యిపోయింది..తెలుగుదేశంలో ఉన్న సినిమా నాయకులు సైతం ఈ విషయంలో పెదవి విరిచారు చివరికి ఎమ్మెల్సీ సారీ చెప్పడంతో కొంచం పర్వాలేదు అనిపించినా టిడిపికి ,టాలీవుడ్ కి మధ్య గ్యాప్ మాత్రం వచ్చింది అనడంలో సందేహం లేదు…అంతేకాదు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రచారానికి టాలీవుడ్ ప్రముఖులు తప్పకుండా ఉండాలి..ఎందుకంటే ముందు నుంచీ టాలీవుడ్ టిడిపి కి వెన్ను దన్నుగా ఉండేది.

అయితే ఎన్టీఆర్ కి చంద్రబాబు కి మధ్య గ్యాప్ పెరగడం మళ్ళీ టాలీవుడ్ కి టిడిపి కి మధ్య గ్యాప్ పెరగడంతో ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న తరుణంలో కళ్యాణ్ రామ్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం మళ్ళీ టిడిపిలో కొత్త జోష్ ని నింపాయి..ఓ చిత్ర వేడుకకి హాజరైన కళ్యాణ్ రామ్ మావయ్య చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ప్రజల కోసం విరామం లేకుండా పని చేస్తున్నారని అందుకే దేశంలోనే ప్రజాదరణ ఉన్న నేత అయ్యారని ఆకాశానికి ఎత్తే శారు…అలాంటి ఆయనకోసం తమ కుటుంబం ఎప్పుడు ఆయన వెనకే ఉంటుందని తెలిపారు.

.నవ్యాంధ్రకు ఆయన పాలన అవసరమని, ఆయన సారథ్యం లేకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని కల్యాణ్ రామ్ అభిప్రాయ పడ్డారు.. తమ అవసరం పార్టీకి ఉందంటే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనూ, జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు..కళ్యాణ్ రామ్ ఈ ప్రకటనతో అటు నందమూరి అభిమానులతో పాటుగా ,తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం సంతోషంలో మునిగిపోయింది..మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేది త్వరలో తేలిపోతుంది..