ఇక తెలుగు దేశం పార్టీకి తారకరాముడే దిక్కా! రెండుగా చీలిపోయే సమయం వచ్చిందా  

తెలుగుదేశంని జూనియర్ మాత్రమే అవకాశం అంటున్న రాజకీయ ప్రముఖులు. .

Jr Ntr Is Only One Option For Tdp-jr Ntr Is Only One Option,nara Lokesh,tdp,ysrcp

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏపీ రాజకీయాలలో ఏకంగా 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా తన రాజకీయ ఉనికిని చాటుకుంటూ వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన తెలుగు దేశం పార్టీ ప్రస్తానంలో చంద్రబాబు కీలక పాత్ర వహించి పార్టీని ఇంత కాలం తన భుజాలపై నడిపిస్తూ వచ్చాడు. వైఎస్ ప్రభంజనంలో కూడా ఏకంగా పదేళ్ళు అధికారంలో లేకపోయినా పార్టీని కాపాడుతూ వచ్చి మళ్ళీ 2014లో అధికారంలోకి చంద్రబాబు తీసుకొచ్చారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ ప్రభంజనంలో తెలుగు దేశం పార్టీ మొత్తం తుడుచుకుపెట్టుకుపోయి కేవలం 24 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో టీడీపీ ప్రస్తానంలో దారుణం ఓటమిని మొదటి సారి చవిచూసింది. .

ఇక తెలుగు దేశం పార్టీకి తారకరాముడే దిక్కా! రెండుగా చీలిపోయే సమయం వచ్చిందా-Jr NTR Is Only One Option For TDP

ఇదిలా ఉంటే ఈ ఓటమికి చంద్రబాబు నాయకత్వ లోపం ప్రధాన కారణం అని చెప్పాలి.

ఇక ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీని పెట్టారో అదే పార్టీతో కలిసి పని చేయడానికి చంద్రబాబు రెడీ కావడం కూడా తెలుగు దేశం పార్టీని అభిమానించే వారికి మింగుడు పడలేదు. ఇక చంద్రబాబు ఐదేళ్ళ పరిపాలనలో పూర్తిగా విఫలం కావడం, ఎమ్మెల్యేల మీద నియంత్రణ లేకుండా వారు చేసిన అన్ని పనులని సమర్ధించడంతో టీడీపీ ఊహించని పరాభవం చవిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇక ఈ ఐదేళ్ళ తర్వాత చంద్రబాబు వయసు రీత్యా పార్టీ బాధ్యతలని వేరొకరికి అప్పగించాల్సిన అవసరం ఉంది.

కాని ప్రస్తుతం పార్టీని సమర్ధవంతంగా నడిపించే నాయకుడు లేడు. ఇప్పుడు టీడీపీ మళ్ళీ గాడిలో పడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు అప్పగించాల్సిందే అనే వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో అనేది వేచి చూడాలి.