తారక్ ని మెప్పించిన నేచురల్ స్టార్ జెర్సీ.. అంత గొప్పగా ఉందా  

Jr Ntr Interesting Tweet On Nani Jersey Movie -

నేచురల్ స్టార్ నాని వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత జెర్సీ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఎమోషనల్ ఎలిమెంట్స్ గౌతమ్ ఈ సినిమాని మరో సారి తన మొదటి సినిమా తరహాలోనే మరో సారి మెప్పించాడు.

Jr Ntr Interesting Tweet On Nani Jersey Movie

అనవసరమైన విషయాల జోలికి పోకుండా క్లీన్ నేరేషన్ తో కథనం నడిపించి, భార్య భర్తల ఎమోషన్ తో పాటు, తండ్రి, కొడుకుల ఎమోషన్ ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించారని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో అర్జున్ పాత్ర కోసం నాని ఎంతగా కష్టపడ్డాడో అనేది తెరపై కనిపిస్తుంది అని చెప్పాలి.

రెగ్యులర్ ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఈ సినిమాకి సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.

ఇదిలా ఉంటే జీర్సీ సినిమా చూసిన తారక్ ట్విట్టర్ లో సినిమా గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.జెర్సీ ఒక అద్భుతమైన చిత్రం.

నన్ను పూర్తిగా మాయలో పడేసింది.గౌతమ్.

అలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు దాన్ని కన్విక్షన్ తోనూ నైపుణ్యంతోనూ తెరకెక్కించినందుకు హ్యాట్స్ ఆఫ్.గౌతమ్ విజన్ ను సపోర్ట్ చేస్తూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినందుకు క్యాస్ట్ and క్రూ కు అభినందనలు.బ్రదర్ నాని.నీ అద్భుతమైన నటనతో బాల్ ను స్టేడియం ఆవతలకి కొట్టావు అని పెట్టిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తారక్ ఇప్పటి వరకు ఎప్పుడు ఈ స్థాయిలో ఒక సినిమా గురించి ప్రశంసించిన సందర్భం లేదు.అలాంటిది జెర్సీ సినిమాపై కామెంట్ చేయడం చూస్తుంటే అతనిని ఎంతగా మెప్పించిందో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jr Ntr Interesting Tweet On Nani Jersey Movie- Related....