జంధ్యాల తరహాలో నవ్వుల కథ కావాలంటున్న ఎన్టీఆర్  

Jr Ntr Interested To Commercial Comedy Story With Trivikram - Telugu `jr Ntr Interested To Commercial Comedy Story, Telugu Cinema, Tollywood, Trivikram

ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తో హిట్స్ మీద హిట్స్ కొడుతున్న స్టార్ హీరోలు ఈ మధ్య కాస్తా రిలక్ష్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు.రొటీన్ కథలతో తమని తాము చూసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతున్న అందరూ ఇప్పుడు కాస్తా జోనర్ మార్చి కామెడీతో నవ్వించాలని ప్రయత్నం చేస్తున్నారు.

Jr Ntr Interested To Commercial Comedy Story With Trivikram

ఇప్పటికే ఆ దారిలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేసి కచ్చితంగా రెండు, మూడు సినిమాలకి ఒకసారి అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీతో నిండిన కమర్షియల్ ఎంటర్టైనర్ కథలు కావాలని దర్శకులని అడిగి మరీ సిద్ధం చేయించుకుంటున్నాడు.తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు కామెడీ పండించాడు.

తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ కూడా తనలో ఉన్న కామెడీ ఈజ్ ని బయటకి తీసాడు.ఆద్యంతం నవ్వులు పూయించాడు.

జంధ్యాల తరహాలో నవ్వుల కథ కావాలంటున్న ఎన్టీఆర్-Movie-Telugu Tollywood Photo Image

చివరికి యాక్షన్ సన్నివేశాల విషయంలోకూడా త్రివిక్రమ్, అల్లు అర్జున్ ని కాస్తా ఫన్ జోనర్ లోనే ప్రెజెంట్ చేశాడు.సీరియస్ నెస్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంచాడు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో మంచి కామెడీ టైమింగ్ ఉండే కథని సిద్ధం చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది.గతంలో అదుర్స్ సినిమాతో పాటు, యమదొంగ సినిమాలో తారక్ తన కామెడీ టైమింగ్ చూపించాడు.

ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ పండించే అవకాశం తారక్ కి రాలేదు.దీంతో ఈ సారి ఫుల్ గా కామెడీ చేసి తన కోరిక తీర్చుకోవడంతో పాటు తన ఫాన్స్ కి కూడా కొత్త ఫీలింగ్ అందించాలని అనుకోని త్రివిక్రమ్ కి తన కోరిక చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో కామెడీ కథలు రాయడంలో సిద్ధహస్తుడైన మాటల మాంత్రికుడు తనలో ఉన్న జంధ్యాలని మరోసారి బయటకి తీస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test