ప్రచారానికి వస్తా కానీ కండిషన్స్ అప్లై – ఎన్టీఆర్   Jr NTR In Elections TDP Campaigning In 2018     2018-10-16   14:44:39  IST  Surya

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలలోకి వెళ్ళడానికి వ్యుహాలని రచిస్తున్నాయి..ముఖ్యంగా ప్రచారం చేసుకోవడంలో కానీ డబ్బాలని గట్టిగా కొట్టుకోవడంలో కానీ ఆరితేరిన అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు గత ఎన్నికల్లో చావు తప్పి కన్ని లొట్టపోయినట్టుగా ఓటమి అంచుల వరకూ వెళ్లి చివరకి పవన్ సాయంతో బయటపడి సీఎం కుర్చీపై కూర్చున్న బాబు కి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

టీడీపీ కి ఇప్పుడు ప్రచారం విషయంలో పెద్ద చిక్కే వచ్చిపడుతోంది..వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీ చేయనున్న నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ కి ప్రచారం చేసే విషయంలో సినీ గ్లామర్ దూరమయ్యింది…జనసేన పార్టీకి పవన్ ఒక్కడి సినిమా గ్లామర్ చాలు…అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో 75 శాతం మద్దతు ఉందనేది అందరికి తెలిసిందే అయితే ఒక్క నందమూరి ఫ్యామిలీ మాత్రమే టీడీపీ కి మద్దతుగా ఉంటూ వస్తోంది అయితే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టీడీపీ తరుపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఏ విధంగా వాడుకున్నారో తెలిసిన విషయమే..ఆ తరువాత

జూనియర్ ని చంద్రబాబు ఎలా పక్కన పెట్టేశాడో కూడా తెలిసిందే..ఈ తరుణంలో గత ఎన్నికల్లో ఎన్టీఆర్ అవసరం చంద్రబాబు కి రాలేదు, బాబు ఎన్టీఆర్ ని పట్టించుకోనూ లేదు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి సినీ గ్లామర్ గనుకా లేకపోతే టీడీపీ కధ కంచికే దాంతో ఎలా ఎన్టీఆర్ ని మచ్చిక చేసుకోవాలి అనుకుంటున్న బాబు కి హరికృష్ణ మరణం కలిసి వచ్చింది..హరికృష్ణ మరణించిన తరుణంలో చంద్రబాబు అన్నీ తానై ఉండి చూసుకున్నారు. చివరి వరకూ ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు కూడా..ఈ క్రమంలోనే మీకు కొండంత అండగా నేనున్నాను అనే భరోసా కోడా బాబు ఇచ్చేశారు..

Jr NTR In Elections TDP Campaigning 2018-

ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ని తాజాగా కదిపినట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది..అయితే ముందుగా రాజకీయాలకి దూరంగా ఉండాలని జూనియర్ నిర్ణయం తెసుకున్నాని తన మనసులో మాట చెప్పడంతోనే బాబు నోటిలో మాట ఆగిపోయిందట..దాంతో ఖంగారు పడిన బాబు బాలయ్యతో మధ్యవర్తిత్వం నడిపించి. మరీ ప్రచారానికి ఒప్పించారట..అయితే ఎన్టీఆర్ ప్రచారం చేస్తాను కాని కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటూ మధ్యలో మరొక బాంబు పేల్చారని తెలుస్తోంది..ఇంతకీ ఏమిటా కండిషన్స్ అంటే..పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయను..ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని ఎన్టీఆర్ తేల్చి చెప్పేశాడట..దాంతో ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకున్నాడట చంద్రబాబు…దానికంటే ప్రచారం మానేస్తానని చెప్తే బాగుండును కదా అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ పై కస్సు మంటున్నారని చెవులు కొరుక్కుంటున్నారు టీడీపీ కీలక నేతలు..