జూనియర్ ఎన్టీఆర్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా....?

తెలుగులో సింహాద్రి, ఆది, యమదొంగ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, తదితర హిట్ చిత్రాల్లో హీరోగా నటించినటువంటి నందమూరి హీరో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు.

 Jr Ntr, Happy Birth Day, Tollywood, Bala Ramayanam,  Remuneration-TeluguStop.com

అయితే  జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు మరియు తండ్రి నందమూరి హరికృష్ణ అప్పటికే సినీ పరిశ్రమలో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మాస్ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.కాగా  ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి బాల రామాయణం అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే అప్పట్లో ఈ చిత్రంలో నటించినందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ దాదాపుగా 4 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడట.

అయితే ఆ పారితోషిక మొత్తాన్ని తన తల్లికి అందించి తనకు నచ్చిన వస్తువు కొనుక్కోమని చెప్పాడట.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులు మాత్రం తన తాత ప్రస్థానాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.

ఆర్.ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.అలాగే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube