'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్ వచ్చేసింది.. రౌద్రంగా కనిపిస్తున్న భీమ్!

Jr Ntr Goes Shirtless As Komaram Bheem In This Fierce And Powerful New Poster From The Rrr

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఇక ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ రాజమౌళి తన ప్లాన్ ను చేస్తున్నాడు.

 Jr Ntr Goes Shirtless As Komaram Bheem In This Fierce And Powerful New Poster From The Rrr-TeluguStop.com

ఇక ఈ రోజు వరుస అప్డేట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి రాజమౌళి పక్క ప్లాన్ తో వస్తున్నాడు.ఈ రోజు రెండు కొత్త పోస్టర్ లను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

Telugu Jrntr, Rajamouli, Ram Charan, Rrr, Rrr Poster, Rrr Trailer, Rrr Ups-Movie

మరి అందులో ఒక పోస్టర్ వచ్చేసింది.మరొక మూడు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ కూడా రాబోతుంది.సినిమాను కొత్తగా ప్రోమోట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువ చేసే పనిలో జక్కన్న ఉన్నాడు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు.

 Jr Ntr Goes Shirtless As Komaram Bheem In This Fierce And Powerful New Poster From The Rrr-ఆర్ఆర్ఆర్’ కొత్త పోస్టర్ వచ్చేసింది.. రౌద్రంగా కనిపిస్తున్న భీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ ఇందులో కొమరం భీమ్ గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కొమరం భీమ్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.ఇక ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ రౌద్రంగా కనిపిస్తున్నాడు.

పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అద్భుతంగా.

ఎంత పట్టుదలగా చేసాడో… ఈ సినిమాలో ఎన్నో ఒళ్ళు గగుర్పొడిచే  సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Telugu Jrntr, Rajamouli, Ram Charan, Rrr, Rrr Poster, Rrr Trailer, Rrr Ups-Movie

ఇక మరొక అద్భుతమైన పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు.ఇది రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు స్టిల్ గా తెలుస్తుంది.ఇక చరణ్ ఫ్యాన్స్ సాయంత్రం వరకు వేచి ఉంటె వాళ్లకు కూడా అద్భుతమైన పోస్టర్ దర్శన మిస్తుంది అని తెలుస్తుంది.

ఇక ప్రెసెంట్ ఎన్టీఆర్ పోస్టర్ ను ”కొమరం భీమ్ ఫర్ ”ఆర్ఆర్ఆర్” అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న రాబోతున్న విషయం తెలిసిందే.

#JrNTR #Ram Charan #RRR #Rajamouli #RRR Trailer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube