ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.ఆర్ ప్రతాప్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన “నిన్ను చూడాలని” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

 Jr Ntr First Movie Ninnu Chudalani Fame Raveena Rajput Real Life And Career News-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా “రవీనా రాజ్ పుత్” నటించగా ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, కే.విశ్వనాథ్, శివాజీ రాజా, ఎమ్మెస్ నారాయణ, సుధా, సుధాకర్, అన్నపూర్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఎన్టీఆర్ కి ఆదిలోనే ఫ్లాప్ ఎదురైనా పట్టు విడవకుండా శ్రమించి టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.

కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన “రవీనా రాజ్ పుత్” మాత్రం నిన్ను చూడాలని చిత్రంలో నటించిన తర్వాత పత్తా లేకుండా పోయింది.

 Jr Ntr First Movie Ninnu Chudalani Fame Raveena Rajput Real Life And Career News-ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రవీనా రాజ్ పుత్ నిన్ను చూడాలని చిత్రంలో నటించడానికంటే ముందుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు మరియు విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్లో తెరకెక్కిన “ఒంటరి పోరాటం” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.అయితే ఏమైందో ఏమోగానీ 2001 లో నిన్ను చూడాలని ఈ చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా పరిశ్రమకి గుడ్ బాయ్ చెప్పింది.

అంతేకాకుండా బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, తదితర చిత్ర పరిశ్రమల్లో కూడా రవీనా రాజ్ పుత్ హీరోయిన్ గా నటించినట్లు సమాచారం లేదు.దీంతో ప్రస్తుతం రవీనా రాజ్ పుత్ ఎక్కడ ఉంది.? ఏం చేస్తుందనే విషయాల గురించి తెలియాల్సి ఉంది.

Telugu Jr Ntr, Jr Ntr First Movie Ninnu Chudalani Fame Raveena Rajput Real Life And Career News, Ninnu Chudalani, Raveena Rajput, Raveena Rajput Marriage And Real Life, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ‘నిన్ను చూడాలని” చిత్రం డిజాస్టర్ అయిన తర్వాత ఈ అమ్మడు కొంతమేర డిప్రెషన్ కి లోనైందని అందువల్లనే సినిమా పరిశ్రమ వదిలిపెట్టి వెళ్లిపోయిందని అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.అంతేకాకుండా సినిమా పరిశ్రమపై తనకు ఆసక్తి లేని కారణంగా కూడా ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయిందని టాక్ వినిపిస్తోంది.కానీ రవీనా రాజ్ పుత్ మాత్రం ఈ విషయాలపై ఇప్పటివరకు స్పందించలేదు.

#Ninnu Chudalani #Jr NTR #Raveena Rajput #JrNtr #RaveenaRajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు