తారక్ ని ఆశ్చర్యానికి గురి చేసిన పంజాబీ యువకుడు  

జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని ఉంది అంటున్న పంజాబీ అభిమాని. .

Jr Ntr Fan Look Like Jr Ntr-look Like Jr Ntr,punjab,telugu Cinema,tollywood

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి సింహం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్ లతో దూసుకుపోతూ తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. లుక్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ఫ్యాన్స్ కి వీలైనంత కొత్తగా కనిపించి సర్ప్రైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా తన స్టామినా పరిచయం చేయడానికి తారక్ ఎదురుచూస్తున్నాడు..

తారక్ ని ఆశ్చర్యానికి గురి చేసిన పంజాబీ యువకుడు-Jr NTR Fan Look Like Jr NTR

ఇదిలా ఉంటే తాజాగా తారక్ కి ఓ పంజాబీ అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు. తనకి తారక్ అంటే ఇష్టమని, అతనితో కలవాలని ఉంది అంటూ సోషల్ మీడియాలో తన ఫోటో షేర్ చేసాడు. ఇక శమిందర్ సింగ్ అనే ఈ పంజాబీ అభిమానిని చూసిన తారక్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అతను అచ్చుగుద్దినట్లు తారక్ లాగే ఉన్నాడు. అతని రూపం జూనియర్ ఎన్టీఆర్ పోలికలకి చాలా దగ్గరగా ఉండటంతో ఇప్పుడు అతని ఫోటోలని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి తారక్ తనలానే ఉన్న తన పంజాబీ అభిమాని కోరిక తీరుస్తాడో లేదో వేచి చూడాలి.