తారక్ పక్కా ఏపీ సీఏం అవుతాడంటున్న సీనియర్ దర్శకుడు

ఎప్పటి నుంచి భవిష్యత్తులో టీడీపీ పార్టీకి పెద్దదిక్కుగా జూనియర్ ఎన్టీఆర్ అవుతాడని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు.అందుకే ఎప్పటి నుంచో అతన్ని పార్టీలో క్రియాశీలకంగా ఉపయోగించుకోవాలని భవిష్యత్తు సారధిగా ప్రాజెక్ట్ చేయాలని కోరుతున్నారు.

 Jr Ntr Dreaming Of Becoming Cm-TeluguStop.com

అయితే చంద్రబాబు మాత్రం తన కొడుకు లోకేష్ ని ముందుకి తీసుకొచ్చి తన తరువాత టీడీపీ వారసత్వం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఆ పార్టీలో అంతర్గతంగా ఎప్పటి నుంచో లోకేష్ నాయకత్వం మీద వ్యతిరేకత ఉంది.

ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు.ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఎన్టీఆర్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ జీకే చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 Jr Ntr Dreaming Of Becoming Cm-తారక్ పక్కా ఏపీ సీఏం అవుతాడంటున్న సీనియర్ దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుబ్బు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తానని క్లారిటీగా చెప్పాడని చెప్పుకొచ్చాడు.ఓ 20 ఏళ్ళు సినిమాలు చేసి తరువాత రాజకీయాల్లోకి వెళ్తానని నెక్స్ట్ తానే సీఏం అని బలంగా తారక్ చెప్పేవాడని అన్నాడు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నెక్స్ట్ సీఎం ఆయనే అని కోడైరెక్టర్ జీకే చౌదరి చెప్పుకొచ్చారు.ఆ మధ్య తారక్ కూడా రాజకీయ ఎంట్రీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకి వాటిపై తీరిగ్గా ఒక రోజు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాడు కాని రాజకీయాలలోకి రానని మాత్రం చెప్పలేదు.

దీనిని బట్టి కచ్చితంగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని జీకే చౌదరి మాటల బట్టి అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ తన పొలిటికల్ ప్లాన్ ఏంటి అనేది రివీల్ అయ్యే అవకాశం ఉంటుందేమో చూడాలి.

#Jr NTR #Chief Minister #Nara Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు