రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో వస్తున్న ఎన్టీఆర్...

టాలీవుడ్ లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్నటువంటి స్టార్ హీరోల్లో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఎటువంటి పాత్ర అయినా సునాయాసంగా నటిస్తూ పాత్రలో చక్కగా ఒదిగిపోయి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి దిట్ట.

 Jr Ntr Come Up With Two Projects In Two Months Gap-TeluguStop.com

అయితే ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించినటువంటి కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు రకాల సన్నివేశాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటన చేశారు.అంతేగాక ఈ చిత్రం వచ్చే ఏడాది మర్చి  నెలలో విడుదల కానున్నట్లు కూడా తెలిపారు.

దీంతో ఈ సంవత్సరంలో ఇక ఎన్టీఆర్ సినిమాలు లేకపోవడంతో నందమూరి అభిమానులు కొంతమేర నిరాశ చెందుతున్నారు.అయితే  వచ్చే ఏడాదిలో జనవరి నెలలో ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదల కానుంది.అలాగే రెండు నెలల వ్యవధిలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం కూడా విడుదల కానుంది.దీంతో ప్రస్తుతానికి నందమూరి అభిమానులు నిరాశ చెందినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం ఫుల్ ఖుషీ చేసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

Telugu Jr Ntr, Jr Ntr Latest, Jr Ntr Rrr, Jrntr Latest, Tollywood-Movie

అయితే ఇలా రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలను రిలీజ్ చేయడం ఇది ఎన్టీఆర్ కి రెండవసారి.జూనియర్ ఎన్టీఆర్ కొత్త గా కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో మొదటగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిత్రం విడుదల కాగా రెండు నెలల వ్యవధిలోనే సుబ్బు అనే చిత్రాన్ని కూడా విడుదల చేశారు.అయితే ఈ రెండు చిత్రాల్లో స్టూడెంట్ నెంబర్ వన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా సుబ్బు యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube