మామ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం?  

మామ కోసం ఎన్నికల ప్రచారం చేయనున్న జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు కలవరం. .

Jr Ntr Campaign To Uncle Narne Srinivasarao-april 11 Elections,chandrababu,jr Ntr Campaign To Uncle,narne Srinivasarao,tdp,ysrcp

ఎలక్షన్స్ డేట్ దగ్గరపడుతున్న కొద్ది ఏపీలో ప్రధాన పార్టీల మధ్య రసవత్త రాజకీయ పోరు మొదలైంది. మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ, ఎలా అయిన ఈ సారి అధికారం సొంతం చేసుకోవాలని వైసీపీ, ఏపీలో ప్రభుత్వం ఏర్పాటులో కీరోల్ పోషించాలని జనసేన ఎవరి దారిలో వారు రాజకీయ వ్యూహాలతో ముందుకి పోతున్నారు. ఇక శనివారం నుంచి అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతున్నాయి...

మామ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం?-Jr NTR Campaign To Uncle Narne Srinivasarao

జెట్ స్పీడ్ తో అన్ని నియోజక వర్గాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి పార్టీ తరుపున ప్రజలకి సందేశం ఇవ్వాలని అధినేతలు ఆలోచిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికలలో మరో రసవత్తర రాజకీయ ఈ సారి నడుస్తుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరుపున బరిలో నిలబడుతున్నాడు.

అలాగే దగ్గుబాటి పురందరేశ్వరి బీజీపీ తరుపున బరిలో నిలబడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మామ చంద్రబాబు అత్యంత సన్నిహితుడు అయిన నార్నే శ్రీనివాసరావు వైసీపీ తరుపున గుంటూరు జిల్లా నుంచి బరిలో నిలబడుతున్నాడు. ఈ నేపధ్యంలో మామ తరుపున తారక్ ఎన్నికల ప్రచారంకి వెళ్ళే అవకాశం ఉందా, ఒక వేళ వెళ్తే అది టీడీపీ ఓటు బ్యాంకుని ప్రభావింతం చేసే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తుంది.