కొరటాల, ప్రశాంత్ నీల్ వచ్చేసారు.. మరి ఇంకో డైరెక్టర్ మాటేంటి?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న పుట్టిన రోజు జరుపుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Jr Ntr, Buchi Babu's 'pedhi' Movie Announcement, Jr Ntr, Prashanth Neel, Koratala Siva, Ntr30, Ntr31, Ntr32, Buchi Babu-TeluguStop.com

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్, చరణ్ లను పాన్ ఇండియా స్టార్ లుగా మార్చేసింది.

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.NTR30 నుండి నిన్న పుట్టిన రోజు సందర్భంగా కొరటాల బిగ్ అప్డేట్ కూడా ఇచ్చేసాడు.ఈ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేసాడు.

 Jr NTR, Buchi Babu's 'Pedhi' Movie Announcement, Jr NTR, Prashanth Neel, Koratala Siva, NTR30, NTR31, NTR32, Buchi Babu-కొరటాల, ప్రశాంత్ నీల్ వచ్చేసారు.. మరి ఇంకో డైరెక్టర్ మాటేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మోషన్ పోస్టర్ ను చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచార్య సినిమా ప్లాప్ ను మర్చిపోయి మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచించడం స్టార్ట్ చేసారు.ఇక ఈయన 31వ సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.

అది కూడా నిన్న అఫిషియల్ గా ప్రకటించారు.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయనున్నాడు.

ఈయన ఎప్పటి లాగానే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ థీమ్ తో రివీల్ చేసాడు.ఫస్ట్ లుక్ లో పోస్టర్ లో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో మెలితిప్పిన మీసంతో ఆకట్టు కున్నాడు.

ఈ రెండు సినిమాలు వచ్చాయి అక్కడి వరకు బాగానే ఉంది.అయితే తారక్ పుట్టిన రోజు కానుకగా మరొక కొత్త సినిమా కూడా రావాల్సి ఉందట.ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం ఎప్పుడో బయటకు వచ్చింది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఈ సినిమా అప్డేట్ కూడా నిన్న రావాల్సి ఉందట.కానీ ఫైనల్ నరేషన్ పూర్తి కాకపోవడం వాళ్ళ ఈ మూవీ అప్డేట్ నిన్న ప్రకటించలేదని.

త్వరలోనే ఫైనల్ అయినా తర్వాత ఈ మూవీ గురించిన అధికారిక అనౌన్స్ మెంట్ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా వినిపిస్తుంది.

మరి ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube