ఆ సినిమా చెయ్యనందుకు ఫీల్ అయిన ఎన్టీఆర్.. ఏ సినిమా అంటే?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్.

 Ntr Feels Bad For Not Doing Bommarillu Movie, Bommarillu Movie, Dil Raju, Siddha-TeluguStop.com

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి ఎవరి నుంచి తనకు సపోర్ట్ లేదు.తన నటనతో కృషితో సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

తనకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించిన ఎన్టీఆర్ కేవలం అది ఒక్కటే కాదు దాదాపు 30కి పైగా చిత్రాలలో నటించారు.

తన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో, బయట జరిగే నేరాలపై వాటి నుండి రక్షణ కోసం వీడియోలు చేసి ప్రజలకు అవగాహనా కల్పిస్తుంటాడు ఎన్టీఆర్.

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒక అసంతృప్తి ఉంది.

అది ఏంటి అంటే.2003లో సిద్ధార్థ, జెనీలియా కలిసి నటించిన “బొమ్మరిల్లు” లో తనకు అవకాశం వచ్చినప్పటికీ అతను కొన్ని కారణాల వల్ల మంచి సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికి బాధపడుతూనే ఉంటాడట.దిల్ రాజ్ తనకు వచ్చి ఈ చిత్ర కథను చెప్పగా బాగా నచ్చిందని, కానీ ఈ సినిమా కథకు, నాకు ఉన్న ఇమేజ్ కు సరిపోదని… దానివల్ల అంత మంచి సినిమాను మోసం చేయవద్దని‌ పక్కకు తప్పుకున్నానని తెలిపారు.

తన సినిమాలో ఎక్కువగా ఫైట్లు, డాన్సులు, కామెడీలు, పవర్ ఫుల్ డైలాగులు వంటివి ఉండాలని అప్పుడే ఫ్యాన్స్ కూడా సినిమాను హిట్ చేస్తారని లేదంటే అభిమానులకు అంత ఎక్కదు అని ఎన్టీఆర్ అప్పట్లో చెప్పారట.కానీ ఆ సినిమాను అతను చేయనందుకు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటాడట.

నిజానికి ఒకవేళ బొమ్మరిల్లు సినిమాలో ఎన్టీఆర్ నటించిన ఎన్టీఆర్ చెప్పినట్టు ఆ సినిమా అభిమానులకు అంత ఆకట్టుకోలేకపోయేది ఏమో.ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా అంటేనే పవర్ ఫుల్ జోష్ తో వుంటుంది.కానీ ఈ సినిమా ఫ్యామిలీకు సంబంధించింది.ఇందులో హీరో పాత్ర తండ్రికి భయపడేలా ఉండటంతో ఎన్టీఆర్ కు ఈ సినిమా సెట్ అవ్వదు అని కొందరు అభిమానుల అభిప్రాయం కూడా.

మరి మీరు ఏం అంటారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube