అనుకున్నది అవ్వలేదు.. ఎన్టీఆర్‌, ఫ్యాన్స్‌ నిరాశ     2018-06-15   01:04:30  IST  Raghu V

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, నందమూరి ఫ్యాన్స్‌ నిన్నటి నుండి కాస్త నిరాశలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేంటి ఎన్టీఆర్‌కు రెండవ కొడుకు పుట్టడంతో అంతా సంతోషంగా ఉన్నారుగా అని మీరు భావించవచ్చు. అసు మ్యాటర్‌ అదే, ఏంటీ అంటే ఎన్టీఆర్‌కు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. కొడుకును ఎంతో ఆప్యాయంగా, అపురూపంగా ఎన్టీఆర్‌ పెంచుకుంటున్నాడు. అభయ్‌ రామ్‌తో ఎన్టీఆర్‌కు చాలా అన్యోన్యం ఏర్పడటం జరిగిందనే విషయం పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది. కొడుకుతో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఎన్టీఆర్‌ ఒక కూతురు కావాలని కోరుకున్నాడు. లక్ష్మి ప్రణతి గర్బవతి అని తేలియడంతో చాలా సంతోషంగా, ఆసక్తిగా కూతురు కోసం ఎన్టీఆర్‌ వెయిట్‌ చేశాడు.

ఆమద్య ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తనకు రెండవ సంతానంగా కూతురు కావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ అభిమానులు అంతా కూడా తమ అభిమాన హీరో కోరుకుంటున్నట్లుగా ఆయనకు కూతురు పుట్టాలని పూజలు చేశారు. కాని అనుకున్నది ఒక్కటి, అయినది మరోటి అన్నట్లుగా పరిస్థితి తారు మారు అయ్యింది. లక్ష్మి ప్రణతి నిన్న మరో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌ స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నా కుటుంబం పెద్దది అయ్యిందని చెప్పేందుకు సంతోషిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

కొడుకు పుట్టినందుకు బాధ అయితే లేదు కాని, కూతురు పుట్టనందుకు నిరుత్సాహంగా ఉందని సన్నిహితుల వద్ద ఎన్టీఆర్‌ అన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే అనుకున్నవి అనుకున్నట్లుగా ఎలా జరుగుతాయి చెప్పండి. కూతురు కావాలని కోరుకుంటే మరో వారసుడు వచ్చాడు. అంత మాత్రాన కుంగి పోవాల్సిన అవసరం లేదని, కూతురు లేనందుకు చిన్న నిరాశ తప్ప అంతకు మించి ఏమీ లేదని నందమూరి కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొందని, తప్పకుండా ఈ సమయం ఎన్టీఆర్‌కు చాలా సంతోషం అంటూ నందమూరి కుటుంబంకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.

నందమూరి ఫ్యామిలీ మరింత పెరిగినందుకు ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దసరా కానుకగా విడుదల చేసేందుకు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌ను చేసేందుకు కూడా ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. మల్టీస్టారర్‌ చిత్రం తర్వాత కళ్యాణ్‌ రామ్‌ బ్యానర్‌లో పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఒక చిత్రంను ఎన్టీఆర్‌ చేయబోతున్నాడు. ఇలా వరుసగా చిత్రాలతో బిజీగా ఎన్టీఆర్‌ ఉన్నాడు. ఇక ఇద్దరి కొడుకులతో ఎన్టీఆర్‌ టైంను ఎంజాయ్‌ చేస్తూ, సినిమాలు వరుసగా చేస్తూ ఫ్యాన్స్‌ను సంతోష పెడతాడు అని ఆశిద్దాం.