బాలయ్యకి అబ్బాయ్ ఎన్టీఆర్ విషెస్... నేను చూసిన మొదటి హీరో మీరే

నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ చేస్తున్నారు.ఇప్పటికే బాలయ్య బాబు అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

 Jr Ntr Special Birthday Wishes To Balakrishna, Tollywood, Telugu Cinema, Balayya-TeluguStop.com

ఇక అభిమానులకి కానుకగా బాలయ్య-బోయపాటి కొత్త సినిమాలో ఒక టీజర్ కూడా వదిలారు.మరో వైపు ఆయన 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా విషెస్ చెబుతున్నారు.

ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకుంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయి బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

చాలా కాలంగా తారక్, బాలయ్య మధ్య కొంత గ్యాప్ ఉంది.అయితే హరికృష్ణ మరణం తర్వాత అందరూ ఒకటయ్యారు.తాజాగా తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి బాలకృష్ణ పాజిటివ్ గా స్పందించారు.ఈ నేపధ్యంలో బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసిన విశేష ప్రత్యేకత సంతరించుకుంది.

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే నాకు ఊహ తెలిశాక చుసిన మొట్ట మొదటి హీరో మీరే.ఈ 60వ పుట్టిన రోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.

జై బాలయ్య అంటూ తారక్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పోస్ట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube