'చిత్రలహరి' కోసం రాబోతున్న ఎన్టీఆర్‌... ఎందుకంటే  

Jr Ntr Attend For Chitralahari Movie Pre Release Event-jr Ntr,mega Hero,nandamuri Hero,sai Dharam Tej

మెగా హీరో మూవీ ఫంక్షన్‌కు నందమూరి హీరో రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆ అరుదైన సంఘటన త్వరలో జరుగబోతుంది. మెగా హీరోసాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలోనే సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఏర్పాటు చేయబోతున్నారు..

'చిత్రలహరి' కోసం రాబోతున్న ఎన్టీఆర్‌... ఎందుకంటే-JR NTR Attend For Chitralahari Movie Pre Release Event

ఆ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే అందుకోసం ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడని, ఎన్టీఆర్‌ రాకతో సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ సినిమాకు ఎన్టీఆర్‌ రావడంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

‘చిత్రలహరి’ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్‌ ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పాడని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం చిత్రలహరి చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్‌ వారితో ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ప్రీ రిలీజ్‌ వేడుకలో వారు కోరిన వెంటనే పాల్గొనేందుకు ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కారణం ఏదో కాని మొత్తానికి చిత్రలహరికి హైప్‌ తీసుకు వచ్చేందుకు ఎన్టీఆర్‌ రాబోతున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌ కోసం సిద్దం అవుతున్న ఎన్టీఆర్‌ త్వరలోనే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జరగబోతున్న షెడ్యూల్స్‌కు హాజరు కానున్నాడు. రాజమౌళి సినిమా చేసే సమయంలో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లేందుకు ఎక్కువగా జక్కన్న అనుమతించడు. కాని ఎన్టీఆర్‌ రిక్వెస్ట్‌ మేరకు ఈ సినిమా వేడుకలో పాల్గొనేందుకు జక్కన్న ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.