టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ..? కండిషన్స్ అప్లై     2018-09-20   08:37:42  IST  Sainath G

తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేదిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతుండడంతో బలమైన, చరిష్మా కలిగిన నాయకుల కోసం బాబు ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన మదిలో జూనియర్ ఎన్టీఆర్ మెదిలాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ పార్టీలో మంచి ఊపు తీసుకొచ్చాడు. ఆ తరువాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల జూ.ఎన్టీఆర్ తండ్రి హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం .. ఆ సమయంలో చంద్రబాబు అన్ని తానై వ్యవహరించడంతో నారా – నందమూరి కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో జూ. ఎన్టీఆర్ ని మళ్ళీ టీడీపీ లో యాక్టివ్ చేయించాలని బాబు ప్లాన్.

పార్టీ కి ఎటువంటి అవసరం వచ్చిన ముందు ఉంటానని జూ.ఎన్టీఆర్ చెప్పినట్టు సమాచారం. రాజకీయం లో ఎన్టీఆర్ కి అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి , సీఎం బాబు కి ఏపీ గురించి ఆలోచించటానికి సమయం సరిపోవటం లేదు . ఈ కారణం తో తెలంగాణ టీడీపీ బాధ్యతలని ఎన్టీఆర్ కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఈ నిర్ణయాన్ని తన జూనియర్ బాబాయ్ బాలకృష్ణ కూడా మద్దతుగా నిలిచాడు . త్వరలో తెలంగాణ లో టీడీపీ భారీ బహిరంగ సభని పెట్టి , ఆ సభా వేదిక గా , లక్షలాది మంది అభిమానుల సమక్షం లో ఎన్టీఆర్ ని టీ . టీడీపీ కి అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనకు జూ. ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ కొంచెం బలహీనపడింది. పార్టీలో ముఖ్య నాయకులంతా టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అయితే.. నాయకులు వెళ్లిపోయారు కానీ కార్యకర్తలు అలాగే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో టీడీపీ బలపడాలని చూస్తోంది. దీనికి పార్టీ అభిమానులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్న జూ. ఎన్టీఆర్ అయితే సమర్ధవంతంగా లాక్కొస్తాడని బాబు ప్లాన్. అయితే… తెలంగాణ బాధ్యతల విషయంలో ఆయనకు పూర్తిగా స్వతంత్రం ఇవ్వకుండా కొన్ని కండిషన్స్ పెట్టగా వాటికి కూడా ఆయన ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

Jr NTR as Telangana TDP President Conditions Appaly-Cm Chandrababu,Jr NTR,Telangana TDP President

పార్టీ కి సబందించిన ఏ విషయమైనా కూడా , పార్టీ పెద్దలతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవద్దు అని , పార్టీ పరంగా ఎక్కడ ,ఎటువంటి మీటింగ్ జరిగినా అందుబాటులో ఉంటూ పార్టీ కి సహకరించాలి , పార్టీ తన సేవలు అవసరమైతే రెండు రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలని నిర్వహించాలని ,అభిమానుల మధ్య విబేధాలు లేకుండా చూసుకోవాలని, వారికి పార్టీ పై అవగాహనా ,ముఖ్యంగా తెలంగాణ లో కింద స్థాయి కార్య కర్తలని కలుపుకొని ముందుకుపోవాలి , తెలంగాణ లో వున్న టీడీపీ సీనియర్ క్యాడర్ తో ప్రతి రోజు చర్చలు జరుపుకుంటూ ,పార్టీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పినట్టు.. వీటికి జూనియర్ ఒకే చెప్పినట్టు టీడీపీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.