బింబిసార టాక్ పై తన సంతోషాన్ని తెలిపిన ఎన్టీఆర్.. ట్వీట్ నెట్టింట వైరల్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

 Jr Ntr Appreciates Audience S Response To Bimbisara , Kalyan Ram , Bimbisara , Jr Ntr , Ntr , Samyukta Menon, Nandamuri Fans,catherine Tresa, Warina Hussain,vasistha Mallidi-TeluguStop.com

ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఆగష్టు 5న అంటే ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు కథాంశంతో ఆసక్తికరంగా నూతన డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.కళ్యాణ్ రామ్ ఎప్పుడు ట్రై చేయని గెటప్ లో కనిపించే సరికి ఈ సినిమాపై ముందు నుండే ఇంట్రెస్ట్ పెట్టారు.

 Jr NTR Appreciates Audience S Response To Bimbisara , Kalyan Ram , Bimbisara , Jr NTR , NTR , Samyukta Menon, Nandamuri Fans,Catherine Tresa, Warina Hussain,Vasistha Mallidi-బింబిసార టాక్ పై తన సంతోషాన్ని తెలిపిన ఎన్టీఆర్.. ట్వీట్ నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.దీంతో ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కు మరింత ఎక్కేసింది.

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందించారు.ఇక ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశ పరచదు అంటూ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు నిజం అవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తారక్ చెప్పినట్టే రిజల్ట్ రావడంతో తన అన్నకు వచ్చిన హిట్ తనకు వచ్చినంత ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు.”బింబిసార గురించి గొప్పగా వింటున్నాను.కళ్యాణ్ అన్న తప్ప వేరొకరు ఈ పాత్రకి న్యాయం చేయలేరు.అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు.డైరెక్టర్ వసిష్ఠ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను విజయం అయ్యేలా చేసిన అందరికి వందనాలు” అంటూ ఎన్టీఆర్ సంతోషంగా ఈ ట్వీట్ చేసాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube