మేలో మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.ఈ సినిమా ముగింపు దశకి వచ్చేసింది.

 Jr Ntr And Trivikram Movie Going On Sets In May, Tollywood, Rrr Movie, Pooja Heg-TeluguStop.com

దీని తర్వాత తారక్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని త్రివిక్రమ్ ఆవిష్కరించబోతున్నాడు.ఇక ఈ సినిమాకి సంబంధించి రకరకాల టైటిల్స్ తెరమీదకి వచ్చాయి.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫ్యామిలీ కథని ఇప్పుడు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి.

త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ పక్కాగా ఉంటారు.అయితే పూజా హెగ్డే ఇందులో ఒక హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.అల వైకుంఠపురంలో సినిమా రీయూనియన్ వేడుకలో కూడా పూజా త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో నటించబోతున్నట్లు చూచాయగా చెప్పింది.అయితే షూటింగ్ స్టార్ట్ అయిన సమయంలో ఆమె డేట్స్ బట్టి అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.అలాగే కియరా అద్వానీ పేరు కూడా వినిపిస్తుంది.

పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబట్టి బాలీవుడ్ ని దృష్టిలో ఉంచుకొని హీరోయిన్ ని ఫైనల్ చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా మేలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube