తొలిసారి కొత్త బ్యాక్ డ్రాప్ లో కొరటాల మూవీ.. ఆచార్య ఎఫెక్టేనా..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

 Jr Ntr And Koratala Siva's Ntr30 , Jr Ntr , Koratala Siva , Ntr30 , Acharya , Ch-TeluguStop.com

ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.

అయితే మెగా హీరోలతో చేసిన సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాసు అని అంతా అనుకున్నారు.

కానీ ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా ప్లాప్ అయ్యింది అని ఈ విషయాన్నీ పక్కన పెట్టి కొరటాల నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది.

ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం విదితమే.మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్ లపై ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నారు.ఇప్పటి వరకు ఇండియన్ స్రీన్ మీద చూడని డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని కొరటాల స్పష్టం చేసిన విషయం విదితమే.

Telugu Acharya, Chiranjeevi, Drop, Jr Ntr, Jrntr, Koratala Siva, Ntr, Ramcharan-

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ అయ్యింది.కొరటాల ఇప్పటి వరకు తన సినిమాల్లన్నిటిని మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించారు.కానీ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మాత్రం మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని కొరటాల అనుకుంటున్నాడట.ఇందులో భారీ మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అన్ని కూడా ఉండేలా స్క్రిప్ట్ ను రెడీ చేసారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube