తారక్ బ్రహ్మానందం కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

బ్ర‌హ్మానందం తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.త‌న అద్భుత న‌ట‌న‌తో కోట్లాది మంది జీవితాల్లో న‌వ్వులు పూయించాడు.

 Jr Ntr And Brahmanadam Hit Movie Combination , Ntr , Brahmanandam , Brundavanam-TeluguStop.com

సినీ తెర‌పై త‌ను క‌నిపిస్తే చాలు జ‌నాల ముఖంపై న‌వ్వు విక‌సిస్తుంది.తెలుగునాట బ్ర‌హ్మానందానికి ఉన్న క్రేజ్ మ‌రే క‌మెడియ‌న్‌కు లేద‌ని చెప్ప‌వచ్చు.

ఒక‌ప్పుడు ఆయ‌న డేట్స్ దొరకాలంటేనే చాలా క‌ష్టంగా ఉండేది.అలాంటి ఈ స్టార్ క‌మెడియ‌న్.

జూనియర్ ఎన్టీఆర్‌తో క‌లిసి సూప‌ర్ కామెడీ పంచాడు.ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.

ఇంత‌కీ వారు క‌లిసి న‌టించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!‌‌‌

అదుర్స్:ఈ సినిమాలో ఇద్ద‌రి కామెడీ అదుర్స్ అనిపించింది.జూ.

ఎన్టీఆర్ పూజారి పాత్రలో చేశారు.బ్ర‌హ్మానందం ఆయ‌న‌కు గురువుగా చేశారు.

వీరిద్ద‌రి కామెడీతో ప్రేక్ష‌కులు విర‌గ‌బ‌డి న‌వ్వారు.వీరి మ‌ధ్య ఉండే ప్ర‌తి సీన్‌వ్వుల పువ్వులు పూయించాయి.

వీరి కామెడీ కార‌ణంగానే సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

బృందావనం:ఈ సినిమాలోనూ ఇద్ద‌రూ కామెడీతో అద‌రగొట్టారు.ఎన్టీఆర్‌కు డ‌మ్మీ తండ్రి క్యారెక్ట‌ర్ లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు.ఈ క్యారెక్ట‌ర్‌లో చివ‌ర‌కు డ‌మ్మీగా మారి ప్రేక్ష‌కుల‌కు ఎంతో వినోదాన్నిపంచాడు.ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్ని సాధించింది.

బాద్ షా:

Telugu Brahmanandam-Movie

ఈ సినిమాలోనూ బ్ర‌హ్మం, ఎన్టీఆర్ కామెడీని ఇర‌గ‌దీశారు.డ్రీమ్ మిషన్ పేరుతో ఎన్టీఆర్ బ్రహ్మీని బకరా చేసి కడుపు చక్కలయ్యేలా నవ్విస్తాడు.కామెడీ పోలీస్ ప్రెస్ మీట్‌తో న‌వ్వులు కురిపించాడు.

ఈ సినిమా కూడా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.యమదొంగ:

Telugu Brahmanandam-Movie

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ మూవీలోనూ బ్రహ్మానందం సూప‌ర్ కామెడీ చేశాడు.చిత్రగుప్తుడుగా మంచి హాస్యం పండించారు.బ్రహ్మీ ఎన్టీఆర్ తో పాటు తన తప్పులతో యముడికి తల నొప్పులు తెప్పిస్తుంటాడు.

యమలోకంలో, భూలోకంలో ఎన్టీఆర్ మోహన్ బాబుతో బ్రహ్మీ చేసే ప్ర‌యాణం ప్రేక్షకులను అద్భుత వినోదాన్ని పంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube