ఆ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్ కొడుకు.. ఫ్యాన్స్ కు పండగే?

ఇప్పటికే వెండితెర పై ఎంతోమంది వారసులు పరిచయమయ్యారు. ప్రస్తుతం స్టార్ హీరోల హోదాలో ఉండటమే కాకుండా వారి వారసత్వాన్ని కూడా వెండి తెరకు పరిచయం చేస్తున్నారు.

 Jr Ntr Act Son Thats Movie-TeluguStop.com

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ అలా వైకుంఠపురంలో కనిపించిన సంగతి తెలిసిందే.ఇక ఎన్టీఆర్ కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నాడట.

టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.ఇదివరకే నందమూరి కుటుంబం నుంచి ఎందరో నటులు పరిచయము కాగా ఇప్పుడున్న హీరోల వారసులు కూడా పరిచయం అవుతున్నారు.

 Jr Ntr Act Son Thats Movie-ఆ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్ కొడుకు.. ఫ్యాన్స్ కు పండగే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ కు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.ఇక వీరిలో ఒకరిని గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పరిచయం చేయనున్నారు.

ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న ఈ సినిమాకు సమంత శకుంతల గా కనిపించనుంది.ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ ని అనుకుంటున్నారని లేదా కుదరకపోతే అల్లు అర్జున్ కొడుకు ని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం పలువురు నటులను ఎన్నుకున్నారు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మణి శర్మ తన స్వరాన్ని వినిపిస్తున్నాడు.అంతేకాకుండా దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ ఈ సినిమాని నిర్మిస్తుంది.మొత్తానికి ఎన్టీఆర్ కొడుకు ఈ సినిమాలో అవకాశం అందుకుంటే మాత్రం నందమూరి అభిమానులకు మరో వారసుడు ఎంట్రీ ఉండటంతో ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.

#Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు