‘అఆ’లో మూడవ ముద్దుగుమ్మ

‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం నితిన్‌ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ప్రారంభం అయిన ఆ చిత్రానికి ‘అఆ’ అనే వైవిధ్యభరిత టైటిల్‌ను ఇప్పటికే త్రివిక్రమ్‌ పెట్టిన విషయం కూడా తెల్సిందే.

 Ananya In Trivikram’s Movie ‘a…aa’-TeluguStop.com

ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా సమంత నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఆ ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు ఈ చిత్రంలో మరో ముద్దుగుమ్మ అనన్యను కూడా ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తెలుగులో ఈమె ‘జర్నీ’ చిత్రంతో పరిచయం అయ్యింది.ఆ చిత్రం తర్వాత మళ్లీ ఈమె మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అనన్య మళ్లీ రీ ఎంట్రీ కోసం చూస్తున్న సమయంలో త్రివిక్రమ్‌ ఈ ఆఫర్‌ను ఇచ్చాడు.పాత్ర ప్రాముఖ్యత దృష్ట్యా ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా ముద్దుగుమ్మ అనన్య సన్నిహితులతో చెబుతుందట.

ఈ చిత్రంతో అనన్యకు మంచి ఎంట్రీ దొరుకుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube