ఓ చిన్న ఇంట్లో స్టార్ట్ అయిన కంపెనీ...స్మార్ట్ ఫోన్ల మార్కెట్ నే షేక్ చేస్తుంది.!

జ‌ర్నీ ఆఫ్ వ‌న్ ప్ల‌స్.!


శాంసంగ్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, గూగుల్ తదితర కంపెనీలకు వన్‌ప్లస్ గట్టి పోటీనిస్తోంది.ఆయా కంపెనీలకు చెందిన ఫోన్లలో ఉండే ఫీచర్లను తక్కువ ధరలకే తమ స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ అందిస్తోంది.దీంతో చాలా మంది వన్‌ప్లస్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 Journey From Oneplus One To Oneplus 6 Mobile-TeluguStop.com

ఈ క్రమంలోనే వన్‌ప్లస్ సంస్థ ఏటా కొన్ని లక్షల సంఖ్యలో ఫోన్లను విక్రయిస్తూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోంది.అయితే నిజానికి వన్‌ప్లస్ కంపెనీని ఏర్పాటు చేసింది.

ఒప్పో ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగే.అతని పేరు పీట్ లౌ.2013 డిసెంబర్‌లో వన్‌ప్లస్ కంపెనీని ఏర్పాటు చేశాడు.అయితే ఆ తరువాత అది మళ్లీ ఒప్పో నేతృత్వంలోకి వెళ్లిపోయింది.

దీంతో ఒప్పో బ్రాండ్ కిందే వన్‌ప్లస్ పనిచేస్తోంది.

నిజానికి ఒప్పో బ్రాండ్ కూడా బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీకి చెందిన సబ్ బ్రాండే.ఇక వన్ ప్లస్ ఒప్పోకు సబ్ బ్రాండ్ అయింది.అంటే వన్‌ప్లస్ సబ్‌బ్రాండ్‌కు సబ్‌బ్రాండ్ అన్నమాట.

ఇక బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు ఉన్న మరో సబ్‌బ్రాండ్ వివో.మార్కెట్‌లో ఒప్పో, వివో కంపెనీలకు చెందిన ఫోన్లు మనకు లభ్యమవుతున్నా, చాలా మందికి ఈ విషయం తెలియదు.

కానీ అవి రెండు మాత్రం ఒకే కంపెనీకి చెందిన సబ్‌బ్రాండ్లు.ఇక వన్‌ప్లస్ విషయానికి వస్తే.2014, ఏప్రిల్ 23వ తేదీన వన్ ప్లస్ వన్ ఫోన్‌ను వన్‌ప్లస్ విడుదల చేసింది.కాగా అప్పట్లో ఈ ఫోన్‌ను కేవలం ఇన్విటేషన్ ప్రాతిపదికగా విక్రయించారు.

దీనిపై వినియోగదారులకు ఆగ్రహం రాగా, తరువాత విడుదల చేసిన ఫోన్లను సాధారణ సేల్‌లోనే వన్‌ప్లస్ విక్రయిస్తూ వస్తోంది.ఇక భారత్‌లో వన్ ప్లస్ డిసెంబర్ 2014లో ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుంచి తన ఫోన్లను ఆ కంపెనీ అమెజాన్‌లోనే విక్రయిస్తూ వస్తోంది.

వన్‌ప్లస్ చైనాకు చెందిన కంపెనీ కాగా పీట్ లౌ తోపాటు కార్ల్ పెయ్ అనే మరో వ్యక్తి దీనికి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

ఇక ఈ కంపెనీకి చెందిన హెడ్ క్వార్టర్స్ చైనాలోని గౌంగ్‌డాంగ్‌లో ఉన్న షెంజెన్ అనే ప్రదేశంలో ఉన్నాయి.అయితే వన్‌ప్లస్ వన్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత సయానోజెన్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు.

తరువాత కొన్ని కారణాల వల్ల సయానోజెన్ ఓఎస్‌ను అభివృద్ధి చేస్తున్న కంపెనీ యు.మైక్రోమ్యాక్స్‌తో కలిసింది.దీంతో వన్‌ప్లస్ తన ఫోన్లకు ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌ను అభివృద్ధి చేసి అందిస్తోంది.ఇక వన్‌ప్లస్ కంపెనీకి 2017లోనే ఫోన్ విక్రయాల ద్వారా 1.4 బిలియన్ అమెరికా డాలర్ల ఆదాయం వచ్చిందని అంచనా.ఇందులో మొత్తం 776 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వన్‌ప్లస్ వన్ ఫోన్ విడుదల తేదీ – ఏప్రిల్ 23, 2014
వన్‌ప్లస్ 2 – జూలై 27, 2015
వన్‌ప్లస్ ఎక్స్ – అక్టోబర్ 29, 2015
వన్‌ప్లస్ 3 – జూన్ 14, 2016
వన్‌ప్లస్ 3టి – నవంబర్ 15, 2016
వన్‌ప్లస్ 5 – జూన్ 20, 2017
వన్‌ప్లస్ 5టి – నవంబర్ 16, 2017
వన్‌ప్లస్ 6 – మే 16, 2018
వన్‌ప్లస్ 6టి – ఇంకా విడుదల కాలేదు, విడుదల తేదీ – అక్టోబర్ 30, 2018

కాగా వన్‌ప్లస్ సిరీస్‌లో వన్‌ప్లస్ 3 తరువాత వన్‌ప్లస్ 4 కాకుండా నేరుగా వన్‌ప్లస్ 5ని విడుదల చేశారు.ఎందుకంటే చైనాలో నంబర్ 4ను దురదృష్ట అంకెగా భావిస్తారు.అందుకే వన్ ప్లస్ 4ని విడుదల చేయలేదు.ఇక విడుదలైన ప్రతి సారి వన్‌ప్లస్ ఫోన్లు కేవలం కొద్ది రోజుల్లోనే 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఏయే వన్‌ప్లస్ ఫోన్లను ఎంత సంఖ్యలో విక్రయించారో ఆ వివరాలను వన్‌ప్లస్ వెల్లడించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube