కాజల్‌ చేసిన తప్పుకు పెద్ద శిక్ష వేసిన మీడియా.. సారీ చెప్పి, కవర్‌ ఇస్తే శాంతించిన జర్నలిస్ట్‌లు  

  • టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మీడియా వారి ఆగ్రహంకు గురైంది. తాజాగా ఈమె బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కవచం’ మూవీలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 7వ తేదీన విడుదల కాబోతున్న ఆ సినిమా గురించి ఇంటర్వ్యూల కార్యక్రమంను నిర్మాతలు కాజల్‌ తో మీడియాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో కాజల్‌ వచ్చేందుకు టైం ఫిక్స్‌ చేసింది.

  • Journalists Angry On Kajal Agarwal At Kavacham Movie Media Meeting-Kajal Kavacham Meeting

    Journalists Angry On Kajal Agarwal At Kavacham Movie Media Meeting

  • కాజల్‌ చెప్పిన సమయంకు వచ్చి మీడియా వారు అంతా కూడా సిద్దం చేసుకున్నారు. కెమెరాలు సెట్‌ చేసుకుని, మైకులు పట్టుకుని, పెన్ను, పేపర్‌ తీసి జర్నలిస్ట్‌లు అంతా సిద్దంగా కూర్చున్నారు. కాని కాజల్‌ మాత్రం గంట గడిచినా రాలేదు. 12 గంటలకు కూడా కాజల్‌ రాలేదు. నిర్మాతలు మరియు పీఆర్‌లు మాత్రం మరో అయిదు నిమిషాలు, మరో పది నిమిషాలు అంటూ జరుపుతూ వచ్చారు. వెయిట్‌ చేయంగ చేయంగా చివరకు 12గంటల 55 నిమిషాలకు వచ్చింది. దాంతో మీడియా వారు తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేశారు.

  • Journalists Angry On Kajal Agarwal At Kavacham Movie Media Meeting-Kajal Kavacham Meeting
  • లేట్‌కు కనీసం కారణం చెప్పకుండా ఏదో పెళ్లికి వచ్చినట్లుగా వచ్చి కాజల్‌ కూర్కోవడంతో జర్నలిస్ట్‌లకు మరింత మంట కలిగేలా చేసింది. దాంతో ఆమె మీడియా సమావేశంను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించి మీడియా వారు అక్కడ నుండి వెళ్లి పోయారు. దాంత కాజల్‌ షాక్‌ అయ్యింది. జర్నలిస్ట్‌కు సారీ చెప్పేందుకు కూడా చూసింది. కాని సెలబ్రెటీలకు ఇదో ఫ్యాషన్‌ అయ్యింది అంటూ మీడియా వారు అక్కడ నుండి వెళ్లి పోయారు. పీఆర్‌ టీం మళ్లీ పిలిచి, ఎక్కువ మొత్తంలో కవర్‌ లు ఇచ్చి ఏదోలా ఇంటర్వ్యూలు తీసుకునేలా చేశారు.