చిరంజీవి రాసిన లెటర్ ఆయన జీవితాన్నే మార్చేసిందట.. అసలేమైందంటే?

స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ నిజ జీవితంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారు.అయితే ఎంతోమందికి సహాయం చేసినా ఆ సహాయాలను చిరంజీవి ఏ మాత్రం ప్రచారం చేసుకోరు.

 Journalist Prabhu Interesting Comments About Megastar Chiranjeevi-TeluguStop.com

వీలైనంత వరకు ఎవరికీ తెలియకుండానే చిరంజీవి సహాయం చేస్తారని ప్రతిరోజూ చిరంజీవి చేసే సహాయం లక్షల్లో ఉంటుందని సమాచారం.చిరంజీవిని అభిమానించి వీరాభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

జర్నలిస్ట్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1988లో తాను జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యాయని ఆగష్టులో చిరంజీవి బర్త్ డే కావడంతో శివరంజినిలో ఒక ఆర్టికల్ రాయాలని చెప్పగా తాను భయపడ్డానని అన్నారు.దర్శకనిర్మాత అల్లాని శ్రీధర్ కూడా చిరంజీవి గురించి ఉదయం వీక్లీకి ఒక ఆర్టికల్ రాయాలని అడిగారని ప్రభు పేర్కొన్నారు.

 Journalist Prabhu Interesting Comments About Megastar Chiranjeevi-చిరంజీవి రాసిన లెటర్ ఆయన జీవితాన్నే మార్చేసిందట.. అసలేమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ ఆర్టికల్స్ పబ్లిష్ అయిన మూడు రోజుల తర్వాత తన అడ్రస్ కావాలని చిరంజీవి గారి నుంచి ఆఫీసులకు ఫోన్లు వచ్చాయని ప్రభు వెల్లడించారు.

ఆ తర్వాత చిరంజీవి నుంచి తనకు లెటర్ వచ్చిందని తన గురించి రాసిన ఆర్టికల్స్ ఎంతో నచ్చాయని తాను బిగ్ జర్నలిస్ట్ అవుతానని చిరంజీవి గారి నుంచి లెటర్ రావడంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయని ప్రభు పేర్కొన్నారు.

చిరంజీవి అంటే యూత్ ఉర్రూతలూగుతున్న సమయంలో ప్రశంసలు రావడంతో జర్నలిజంపై తనకు రెస్పెక్ట్ పెరిగిందని ప్రభు వెల్లడించారు.తాను చిరంజీవి వల్లే ఇంతకాలం జర్నలిస్ట్ గా కొనసాగుతున్నానని ప్రభు అన్నారు.

Telugu Chiranjeevi Letter, Interesting Comments, Interesting Facts, Journalist Prabhu, Lankeswarudu-Movie

లంకేశ్వరుడు సినిమా షూటింగ్ సమయంలో తాను చిరంజీవిని కలిశానని తన పేరు చెప్పగానే కూర్చోండి ప్రభూ అనడంతో థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానని ప్రభు పేర్కొన్నారు.ఆ విధంగా చిరంజీవితో పరిచయం ఏర్పడగా తర్వాత సినిమాల షూటింగ్ ల సమయంలో కూడా తాను కలిశానని ప్రభు వెల్లడించారు.

#Lankeswarudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు