అది గాడిద సార్.. మాస్క్ ఎందుకు పెట్టుకుంటుంది..?!

పెద్ద వారి చేతిలో పిల్లలు అనేక సార్లు అడ్డగాడిదలా పెరగావు… ఎన్నిసార్లు చెప్పినా వినవా…? అంటూ తిట్లు తినకుండా ఉండేవారు చాలా తక్కువే.అయితే ఇదే సామెతని తాజాగా ఓ గాడిదనే ఉదాహరణగా చూపిస్తూ జర్నలిస్ట్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.

 Corona Virus, Lock Down, Donkey, Journalist, Ips Officer, Twitter, Best Media In-TeluguStop.com

ప్రజలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్ని సార్లు కరోనా ను దూరం చేయడానికి మూతికి మాస్కులు ధరించండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ మాటలను ఎప్పుడో పక్కన పెట్టేశారు ప్రజలు.ఇందుకోసం ప్రజలకు ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చిన, ఫైన్ లు వేసిన జనాల్లో మాత్రం మార్పులు రావట్లేదు.

ఈ అంశాన్ని కొత్తగా చూపించాలని కొన్న జర్నలిస్ట్ ఏకంగా రోడ్డు మీద వెళ్తున్న ఓ గాడిద మూతి దగ్గర మైకు పెట్టి, మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు…? అని అడిగాడు.నిజానకి అయితే ఆ ప్రశ్న గాడిద ఎందుకు సమాధానం ఇస్తుంది చెప్పండి.

అయితే వెంటనే ఆ పక్కనే మాస్కులు లేకుండా వెళుతున్నాడు ఓ మనిషి.ఆ వ్యక్తి ని ఆపి ఆ గాడిదను చూపి మాస్క్ పెట్టుకోకుండా ఎందుకు బయటికి వచ్చారు అని అడిగానని, దానికి సమాధానం చెప్పట్లేదు ఎందుకని అతనిని ప్రశ్నించాడు.

దానికి ఆ వ్యక్తి అది గాడిద కాదు సార్….ఎలా చెబుతుందని అన్నాడు.

దీనితో రిపోర్టర్ అవునా… అందుకేనా ఈ గాడిద లాక్ డౌన్ సమయంలో మాస్క్ వేసుకోకుండా రోడ్డుమీద తిరుగుతుంది అని అన్నాడు.

Telugu Interview, Corona, Donkey, Ips, Journalist, Lock-

దీంతో ఆ వ్యక్తి తనను జర్నలిస్ట్ గాడిద తో పోల్చడం అర్థం చేసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.అలాగే అక్కడి తిరుగుతున్న మాస్క్ లేని కొందరిని ఇలాగే మరికొంతమంది కూడా ప్రశ్నించాడు.దీనికి సంబంధించిన వీడియోను భారతదేశ ఓ ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా ట్రెండ్ అవుతుంది.

ఆ వీడియోకు లాక్ డౌన్ సమయంలో బెస్ట్ మీడియా ఇంటర్వ్యూ ఇదే అంటూ క్యాప్షన్ ని కూడా జత చేశాడు.జర్నలిస్ట్ చేసిన ప్రయత్నానికి నెటిజన్లు అభినందనలను తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube