పవన్ ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ము ఉందా...?

పవన్ కళ్యాణ్ పై మీడియా చేస్తున్న దాడి తీవ్రం అయ్యింది.మీడియా నా తల్లి పరువు తీసింది.

 Journalist Asks 9 Questions To Pawankalyan-TeluguStop.com

టీవీ 9 ,టీవీ 5 లాంటి చానెల్స్ చూడాలి అంటే ఎంతో ఇబ్బందిగా ఉంటోంది అంటూ హాట్ హాట్ భామల పక్కన నటించిన పవన్ కళ్యాణ్ రచ్చ రచ్చ చేసిన విషయం విధితమే.అయితే మీడియా ని టార్గెట్ చేస్తూ పవన కళ్యాణ్ ఒక్క సారిగా రివర్స్ అవ్వడంతో మీడియా పెద్దలు సైతం పవన్ కి లీగల్ నోటీసు లు పంపారు.

దాంతో పవన్ కళ్యాణ్ కూడా మీడియా పై ఎక్కడికైనా వెళ్తా అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు అంతేకాదు పలానా ఛానెల్స్ చూడకండి అంటూ బహిరంగంగా చెప్పడంతో మీడియాకి చిర్రెత్తు కొచ్చింది అయితే

ఇన్నాళ్ళు మీడియాని నీ సొంత లాభం కోసం వాడుకుని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఎంతవరకూ సమజసం అంటూ అందరు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో గణేష్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ జవాబు చెప్పే దమ్ము లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సెటైర్స్ వేస్తున్నారు ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ఏమిటి అంటే.

1.ఏ తల్లికి అవమానం జరిగినా స్పందించాలి.ఎక్కడ అవమానం జరిగినా ఖండించాలి.

కానీ ఓ అమ్మాయి సినీ జీవితంలో కొనసాగాలంటే… శీలాన్నే ఫణం గా పెట్టాల్సి వస్తోందని రోడ్డు పైకి వస్తే.పోలీసు స్టేషన్ కి వెళ్లాలని చెప్పిన మీరు మరి మీకు జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు.?

2.అమ్మకు అవమానం… ఆన్ పార్లమెంటరీ మాట…అమ్మాయిల శీలం… వీటిలో దేన్ని సీరియస్ గా తీసుకోవాలి అంటే ఏం చెప్పాలి.?

3.మన పార్టీ ఆవిర్భావం… మన సినిమాల వేడుకలు… ఆహా.ఓహో… అనే పొగడ్తలు… చేసినప్పుడు మనకు గుర్తు రాని… మీడియా యాజమాన్యాలు… వారి ఆర్ధిక లావాదేవీలు… ఇప్పుడు మనల్ని విమర్శించే వారి వార్తలు వేసినప్పుడే గుర్తుకు రావడం… ఎంతవరకు సమంజసం అని నిలదీస్తుంటే ఏమని స్పందించాలి.?

4.మీడియాలను నడుపుతున్న వారిలో.దొంగలు-దొరలు జాబితాలు ట్వీట్ చేసిన మనం.మనంకలసి తిరిగిన…కౌగలించుకున్న… భేటీలు చేసిన…విమర్శిస్తున్న రాజకీయ నాయకుల్లో దొంగలు -దొరలు.లిస్థ్ లు ఎప్పుడు ట్వీట్ చేస్తారంటే ఎప్పుడని చెప్పాలి.?

5.“మా” ఎన్నికలు దారితప్పి రోడ్డెక్కినప్పుడు.సినిమా వాళ్ళపై డ్రగ్ బానిసలుగా.విచారించినప్పుడు… ఏనాడూ పరిశ్రమ తరపున ప్రశ్నించని మనం… .“మా” ఆఫీసు మెట్లు కూడా ఎక్కని మనం.ఈ రోజు.“మా” ఆఫీస్ లో…చేసిన హంగామా… .“మా” కార్యవర్గం కు ఇచ్చిన అల్టిమేటం తో…పవన్ మా (అమ్మ) గొప్పదా? మూవీ ఆర్టిస్టుల .“మా” గొప్పదా అంటే ఏమని చెప్పాలి.?

6.తొలిప్రేమలో నందిని… సినిమా జీవితంలో రేణూ దేశాయి… రాజకీయ ప్రస్థానం లో అన్నా లేజ్నోవా … ఇలా మీరు సహా ధర్మచారిణులుగా చేసుకున్నాప్పుడు.అది వ్యక్తి గత జీవితం అని చాలా మంది అన్నప్పుడు… అందరితో పాటు మీడియా పెద్దలు సైతం సమర్ధించినప్పుడు… మహిళా సంఘాల గొంతులు అంతగా వినిపించలేనప్పుడు.వీళ్లంతా అప్పట్లో అమ్ముడు పోయారంటున్న ప్రశ్నలకు… ఎంత ఖర్చయిందని చెప్పాలి.?

7.ఇంత చర్చకు దారి తీసిన క్యాస్టింగ్ కౌచ్… మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో … మనం ఉందని చెప్పాలా? లేదని చెప్పాలా?

8.ప్రశ్నించడానికి వచ్చిన మనం… కత్తి మహేష్ ప్రెస్ క్లబ్ సాక్షిగా అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు … సమాధానం ఎందుకు చెప్పలేదు అంటే… ఏమని చెప్పాలి.?

9 కేన్సర్ బాధితులకు మీరు ప్రాణం పోసారని.ఉద్దానంలో మీ ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించిందని అన్నప్పుడు….

ఎన్ని కోట్లు తీసుకుని మీడియా కవర్ చేసిందో చెప్పమంటే ఎలా చెప్పాలి.?

రేపటి నుంచి మన కార్యాచరణ ప్రారంభమవుతుందన్నారు మీరు.ఈ ప్రశ్నలకు మేము ఏం సమాధానం చెప్పాలో చెబితే చాలు… మీ అభిమానులుగా … మా కార్యాచరణ ప్రారంభించేస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube