మసాచుసెట్స్ సెనేట్ బరిలో కెనడీ మనవడు

అమెరికాలోని రాజకీయ కుటుంబాల్లో ఒకటైన కెనడీ ఫ్యామిలీకి చెందిన జోసెఫ్ కెనడీ-III మసాచుసెట్స్‌ సెనేటర్‌‌గా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అతని అభ్యర్ధిత్వాన్ని డెమొక్రటిక్ పార్టీ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Joseph Kennedy Iii Is Considering A Massachusetts Senate Run Kenadi Grand Son-TeluguStop.com

దీనిపై జోసెఫ్ కెనడీ స్పందిస్తూ ప్రస్తుతం దేశం రాజకీయపరంగా క్లిష్టపరిస్థితుల్లో ఉందని.పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.

Telugu American, Massachusetts, Telugu Nri Ups-

  అయితే మసాచుసెట్స్ సెనేట్ స్థానం జోసెఫ్‌కు దక్కడం అంత సులభమైన విషయం కాదంటున్నారు పరిశీలకులు.సుమారు నాలుగు దశాబ్ధాలుగా మసాచుసెట్స్ రాజకీయాలను శాసిస్తున్న ఎడ్వర్డ్ మార్కీని కాదని ఆ సీటును యువకుడైన జోసెఫ్‌కు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే తాను 2020లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఎడ్వర్డ్ స్పష్టం చేశారు.

Telugu American, Massachusetts, Telugu Nri Ups-

  అదే సమయంలో కెన్నడీ కుటుంబసభ్యులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని.వారు జాతికి స్ఫూర్తి ప్రదాతలని ఎడ్వర్డ్ కొనియాడారు.కాగా మసాచుసెట్స్ నుంచి జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, ఎడ్వర్డ్ ఎఫ్ కెనడీలు కలిసి 66 ఏళ్ల పాటు అమెరికా సెనేట్‌లో ప్రాతినిథ్యం వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube