నామినేషన్ లో బిడెన్ గెలుపు..ఇక తాడో పేడో..!!!  

Joseph Bidden Trump America Elections - Telugu America, America Elections, Democraticparty, Joseph Bidden, Republican Party, Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ట్రంప్ ని ఓడించడానికి డెమోక్రటిక్ పార్టీకి ఆయుధాలుగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు.

 Joseph Bidden Trump America Elections

ట్రంప్ మళ్ళీ రిపబ్లికన్ పార్టీ తరుపున నామినేషన్ వేసి మళ్ళీ అధ్యక్ష పదవిని తప్పకుండా చేపడుతారని భావించిన వారందరూ మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తమ నిర్ణయాలని మార్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే

ట్రంప్ ని వచ్చే ఎన్నికల్లో డీ కొట్టడానికి సర్వ హక్కులని సాధించి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలవడానికి జోసెఫ్ బిడెన్ సిద్దంగా ఉన్నారు.

నామినేషన్ లో బిడెన్ గెలుపు..ఇక తాడో పేడో..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అమెరికా అధ్యక్ష రేసులో పోటీ చేయడానికి తగిన అర్హతలతో అధికారికంగా బిడెన్ నియమించా బడ్డారు.నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ ట్రంప్ తో తలబడటానికి సిద్దంగా ఉన్నారు.

తన పార్టీ తరుపునుంచీ నామినేషన్ వేయడానికి సుమారు 1991 ఓట్లు సాధించిట్లుగా బిడెన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఏప్రియల్ నెలలోనే సాండర్స్ తప్పుకోవడంతో బిడెన్ కి లైన్ క్లియర్ అయ్యింది.బిడెన్ అధ్యక్ష రేసులో నిలబడటానికి ట్రంప్ ని డీ కొట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు.ముందుగా ఐయోవా , న్యూ హాంషైర్ ప్రాంతాలలో ప్రచారం చేసి తరువాత దక్షిణ కరోలినాలో వ్యూహాత్మక అడుగులు వేస్తూ విజయం వైపు దూసుకు వెళ్ళారు.

ఇదిలాఉంటే బిడెన్ వయసు 77 కాగా ఇప్పటి వరకూ ఆయన రెండు సార్లు అధ్యక్ష పీటం కోసం పోటీ పడ్డారు.బిడెన్ కి ఒబామా మద్దతు బలంగా ఉండటం గెలుపుపై బిడెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Joseph Bidden Trump America Elections Related Telugu News,Photos/Pics,Images..

footer-test