వర్మకు దిమ్మతిరిగే పంచ్.. ఆర్జీవీ టైటిల్‌తో అదరగొట్టిన జొన్నవిత్తుల  

Jonnavittula Rgv Title Poster Released - Telugu Jonnavittula, Ram Gopal Varma, Rgv, Roju Gille Vadu, Telugu Movie News

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి వాతావరణం సృష్టించాడో అందరికీ తెలిసిందే.వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు తెలుగు జనాల్లో హాట్ టాపిక్‌గా మారి పరోక్షంగా ఆంధ్ర రాజకీయాలపై ప్రభావం చూపించాయని ఓ టాక్.

 Jonnavittula Rgv Title Poster Released

అయితే ఇలాంటి సినిమాలతో వివాదం సృష్టించిన వర్మ, ఓ టీవీ డిబేట్ షో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుతో నువ్వా నేనా అనే స్థాయిలో వాగ్వివాదం జరిపాడు.ఆ సందర్భంగా వర్మకు త్వరలో ఫ్యూజులు లేపే సినిమాను చేస్తానంటూ జొన్నవిత్తుల శపథం చేశారు.

అనుకున్నట్లుగానే ఆయన ఆర్జీవీ పేరుతో ఓ సినిమాను ప్రారంభించారు.తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

వర్మకు దిమ్మతిరిగే పంచ్.. ఆర్జీవీ టైటిల్‌తో అదరగొట్టిన జొన్నవిత్తుల-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

‘రోజూ గిల్లే వాడు’ అనే అదిరిపోయే టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంతే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశారు.మొత్తానికి అందరినీ గిల్లే రామ్ గోపాల్ వర్మను జొన్నవిత్తుల గిల్లుతున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ పోస్టర్‌ను ఆర్జీవీ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు