నా మీద మోహన్ బాబు దావా వేశారు.. జొన్నవిత్తుల సంచలన వ్యాఖ్యలు?

ప్రముఖ తెలుగు కవిగా, గేయ రచయితగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.పేరడీ పాటలు రాయడం ద్వారా జొన్నవిత్తుల మంచి పేరును సంపాదించుకున్నారు.

 Jonnavittula Ramalingeswara Rao Sensational Comments On Mohan Babu-TeluguStop.com

దాదాపు 600కు పైగా పాటలు రాసి రచయితగా పాపులారిటీని తెచ్చుకున్న జొన్నవిత్తుల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోహన్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.మోహన్ బాబుతో వివాదం గురించి విజయవాడతో శతకం ప్రింటింగ్ జరుగుతుందని ఆ సమయంలో దేనికైనా రెడీ సినిమాకు వెళ్లానని జొన్నవిత్తుల చెప్పారు.

టెక్నికల్ గా సినిమా బాగానే ఉన్నా సంభావన ఎక్కువ పడేస్తే వాళ్లే తోక ఆడించుకుంటూ వస్తారనే డైలాగ్ విని తనకు కోపం వచ్చిందని జొన్నవిత్తుల వెల్లడించారు.బ్రాహ్మణుడిని అలా చూపించడం కరెక్ట్ కాదని జొన్నవిత్తుల పేర్కొన్నారు.

 Jonnavittula Ramalingeswara Rao Sensational Comments On Mohan Babu-నా మీద మోహన్ బాబు దావా వేశారు.. జొన్నవిత్తుల సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరొక సీన్ లో వాళ్ల ఆయన ఇక్కడ లేడు వాళ్ల ఆయన చేసిన్ పనులు నన్ను చేయమంటుందా.? అనే డైలాగ్ ఉంటుందని జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.

దేనికైనా రెడీ సినిమాను అస్తవ్యస్తంగా తీశారని జొన్నవిత్తుల వెల్లడించారు.బ్రాహ్మణులు ఆ సమయంలో బాధ పడటంతో తప్పు లేదని జొన్నవిత్తుల పేర్కొన్నారు.తాను పలు ఛానల్స్ లో జరిగిన చర్చల్లో పాల్గొనగా తనకు కౌంటర్ చేసేవాళ్లు వచ్చారని తాను ఆ తప్పులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పానని జొన్నవిత్తుల తెలిపారు.తాను దైవ ప్రేరణతో వెళ్లి మాట్లాడానని జొన్నవిత్తుల పేర్కొన్నారు.

రెండు నెలల తర్వాత మోహన్ బాబు తనపై పరువునష్టం దావా వేయగా 5 సంవత్సరాల తర్వాత ఆ దావాను కొట్టేశారని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పారు.జొన్నవిత్తుల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఆయన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జొన్నవిత్తుల చేసిన కామెంట్ల గురించి మంచు ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

#Manchu Family #Comments #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు