ప్రపంచ రికార్డు సృష్టించిన జోకర్  

Joker Movie Creates World Record-joaquin Phoenix,joker,joker Movie,todd Phillips

హాలీవుడ్‌ చిత్రాలకు భారత్‌తో పాటు ఇతర దేశాలలో కూడా ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.ఇప్పటికే ఈ కోవలోకి అనేక సినిమాలు వచ్చి చేరాయి.

Joker Movie Creates World Record-joaquin Phoenix,joker,joker Movie,todd Phillips Telugu Tollywood Movie Cinema Film Latest News Joker Movie Creates World Record-joaquin Phoenix Joker Todd Phillips-Joker Movie Creates World Record-Joaquin Phoenix Joker Todd Phillips

కాగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జోకర్ సినిమా పెను సంచలనాలకు కేరాఫ్‌గా మారింది.జాక్విన్ ఫీనిక్స్ ముఖ్య పాత్రలో నటించిన జోకర్ సినిమా తాజాగా ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఏకంగా బిలియన్ డాలర్లు వసూలు చేసిని సినిమాగా జోకర్ రికార్డు సృష్టించింది.

భారత కరెన్సీ ప్రకారం రూ.71,63,50,00,000 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా జోకర్ రికార్డు క్రియేట్ చేసింది.

ఈ ఫీట్ సాధించిన తొలి చిత్రంగా ఆర్-రేట్‌ను జోకర్ సినిమా సంచలనం సృష్టించింది.అటు పలు ఫిల్మ్ ఫెస్టివల్‌లలో జోకర్ సినిమా ఉత్తమ అవార్డును అందుకుంది.

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై వివాదాలు చెలరేగాయి.

సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ పలువురు ఈ సినిమాను వ్యతిరేకించినప్పటికీ, జోకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ సాధించింది.మొత్తానికి ఒక వివాదాస్పద చిత్రం కూడా ప్రపంచ రికార్డును క్రియేట్ చేసి తన సత్తా చాటింది.