ఫోన్ చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నేత‌లు.. ఎందుకంటే..?

ఈ మ‌ధ్య రెండు తెలుగు రాష్ట్రాల నేత‌ల్లో ఓ భ‌యం విప‌రీతంగా పెరిగిపోతోంది.ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అంద‌రిలోనూ ఈ భ‌యం ప‌ట్టుకుంది.

 Joint Karimnagar Leaders Who Are Afraid To Make A Phone Call  Because, Trs, Phon-TeluguStop.com

అదేనండి ఫోన్ కాల్స్ లీక్ భ‌యం.ఎప్పుడు ఎవ‌రితో మాట్లాడితే ఎవ‌రు త‌మ కాల్‌ను లీక్ చేస్తారో అనే భ‌యం మొద‌టి నుంచి అంద‌రిలోనూ ఉంది.ఇందుకు అధికార‌, ప్ర‌తిప‌క్షాల లీడ‌ర్లు కూడా స‌ఫ‌ర్ అవుతున్నారు.అందుకే దీనికి చాలా దూరంగా ఉండాల‌ని, అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భావిస్తున్నారు.ఈ భ‌యం ముఖ్యంగా తెలంగాణ‌లోని క‌రీంగ‌న‌ర్ నేత‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రితో మాట్లాడినా స‌రే వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది.

దీంతో వారంతా చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు.గ‌తంలో చూసుకుంటే ఏ ఎన్నిక‌లు వ‌చ్చినాస‌రే ప్ర‌తిసారి ఎవ‌రిదో ఒక‌రి ఫోన్ కాల్ లీక్ అవుతూనే ఉంది.

ఇక త‌మ ఆడియో లీక్స్ కాస్తా సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో త‌మ ప‌రువు పోతుంద‌ని అంతా భ‌య‌ప‌డుతున్నారు.ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండ‌టంతో ఈసారి ఎవ‌రి ఫోన్ కాల్స్ లీక్ అవుతాయో అని టీఆర్ఎస్ శ్రేణులు, నేత‌లు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

Telugu Mlc, Phone, Tg, Tg Poitiics, Trs, Ts-Telugu Political News

ఇప్పుడు ఉమ్మ‌డి జిల్లాలోని రెండు స్థానాలను గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ నానా ప్ర‌త‌య్నాలు చేస్తోంది.ఎల్.రమణ, భాను ప్రకాశ్ టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీకి దిగారు.అయితే వీరితోపాటు 10 మంది వ‌ర‌కు ర‌ణ‌రంగంలో ఉన్నారు.

అయితే టీఆర్ఎస్ త‌ర‌ఫున నిల‌బ‌డ్డ వారిని గెలిపించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌టించ‌డంతో వారు ఎవ‌రితోనూ ఫోన్ మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ట్లేదంట‌.వీలు అయితే నేరుగా వెళ్లి మాట్లాడుతున్నారు త‌ప్ప ఫోన్ కాల్ మాత్రం మాట్లాడ‌ట్లేదు.

ఇదే విష‌యం ఇప్పుడు ఉమ్మ‌డి జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube