మహాత్మాగాంధీ 152వ జయంతి: అమెరికా ఘననివాళులు.. భారతీయులకు శుభాకాంక్షలు

భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆయన నివాళులర్పించాయి.ఈ సందర్భంగా అమెరికా సైతం బాపూజీని స్మరించింది.

 Join Friends In India To Celebrate 152nd Birthday Of Mahatma Gandhi: Us Official-TeluguStop.com

గాంధీ జన్మదినం సందర్భంగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమ స్నేహితులతో కలిసి సాగుతామని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి టోనీ బ్లింకెన్ ట్వీట్ చేశారు.గతవారం ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మరోవైపు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ వాషింగ్టన్ డీసీలోని గాంధీ స్మారక కేంద్రంలో మహాత్ముడికి నివాళులర్పించారు.గాంధీజీ జీవితం, వారసత్వం భారత్-అమెరికాలతో పాటు ప్రపంచంలోని తరాలను ప్రభావితం చేస్తూ, స్పూర్తినిస్తూనే వున్నాయని సంధూ ట్వీట్ చేశారు.ఈ వారం ప్రారంభంలో ప్రతిష్టాత్మక హోవార్డ్ యూనివర్సిటీలో విద్యార్ధులు రాయబార కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి సంధూతో చర్చలు జరిపారు.‘‘ సున్నితమైన మార్గంలో ప్రపంచాన్ని కదిలించవచ్చని’’ మాకు నేర్పిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అని హోవార్డ్ యూనివర్సిటీ బంచ్ ఇంటర్నేషనల్ సెంటర్‌ ప్రతినిధులు అన్నారు.

గాంధీ 152వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని.బహుళత్వం, శాంతి గురించి ఆయన భోదించిన పాఠాలు నేర్చుకోవడానికి చిన్న మార్గాలను కనుగొనడం ద్వారా మనం బాపూజీని సత్కరిద్దామని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు.మహాత్మా గాంధీ అమెరికాకు ఎన్నడూ రానప్పటికీ.భారత జాతిపిత విగ్రహాలను ఇండియాకు ఆవల అత్యధిక సంఖ్యలో కలిగి వున్న ఏకైక దేశం అమెరికాయే అని ఖన్నా గుర్తుచేశారు.

ఆయన శాంతి, తత్వశాస్త్రం .మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలో జరిగిన అమెరికా పౌరహక్కుల ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రజలందరికీ గౌరవం, సమానత్వం కల్పించడానికే అంకితం చేశారని అమెరికా నేషనల్ మాల్, మెమొరియల్ సర్వీసెస్ తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు, న్యాయం కోసం అహింసాయుత ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన మహాత్మా గాంధీ పుట్టినరోజును ఉద్దేశిస్తూ మేరీలాండ్ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో కామన్స్ రాశారు.1869లో ఈ రోజున మానవ హక్కుల ఛాంపియన్ గాంధీ జన్మించారని యూఎస్ కేపిటల్ హిస్టారిక్ సొసైటీ ప్రశంసించింది.మరోవైపు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే వందలాది మంది అమెరికావ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube