అమెరికా: భారతీయుడి ఘనత.. జాన్‌సన్‌విల్లే సిటీ కౌన్సిల్‌కి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డ్

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని జాన్సన్‌విల్లే మున్సిపల్ కార్యాలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.ఈ సిటీ కౌన్సిల్‌కి తొలిసారిగా ఒక భారతీయ అమెరికన్ ఎన్నికై చరిత్ర సృష్టించాడు.

 Johnsonville Elects First Indian American City Councilman In South Carolina ,  J-TeluguStop.com

మంగళవారం సాయంత్రం జాన్సన్‌విల్లే సిటీ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డిపెన్ ఖంభైటా విజయం సాధించారు.కౌన్సిల్‌లోని మూడు సీట్లలో ఒకదానిని గెలుచుకోవడానికి ఖంభైటా 84 ఓట్లు (27.71 శాతం) పొందారు.రాష్ట్రంలో మొట్టమొదటి భారతీయ అమెరికన్ మున్సిపల్ ఎన్నికైన వ్యక్తికావడం గొప్ప విజయంగా వుందని ఖంభైటా అన్నారు.

ఇది గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

తాను లండన్‌లో జన్మించానని.తన కుటుంబం తూర్పు భారత్ నుంచి వలస వచ్చిందని ఖంబైటా చెప్పారు.2004లో తాను నగరంలోని టీ అండ్ జే మార్కెట్‌ను కొనుగోలు చేసినప్పుడు జాన్సన్‌విల్లేకు తన మకాంను మార్చినట్లు ఆయన తెలిపారు.ఆ స్టోర్‌ను ఓఎం మినీ మార్ట్‌గా పేరు మార్చిన ఖంబైటా.దాదాపు 17 ఏళ్ల తర్వాత దానిని నడిపిస్తున్నాడు.నగర రాజకీయాలలో ప్రవేశించడానికి తనను ప్రోత్సహించింది స్టోర్ కస్టమర్లేనని ఖంభైటా వెల్లడించారు.2004లో తన కుటుంబం దక్షిణ ఫ్లోరెన్స్ కౌంటీ నగరానికి మారినట్లు ఆయన తెలిపారు.

దక్షిణ కరోలినాలో పెరుగుతున్న భారతీయ అమెరికన్ల ప్రభావానికి తాజా ఎన్నిక నిదర్శనమన్నారాయన.ఇక ఈ ప్రాంతంలో భారతీయ అమెరికన్లలో మాజీ సౌత్ కరోలినా గవర్నర్, ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, లూసియానా మాజీ గవర్నర్, కాంగ్రెస్ సభ్యుడు బాబీ జిందాల్ వున్నారు.

ఖంబైటా తన భార్య, ముగ్గురు పిల్లలతో జాన్సన్‌విల్లేలో నివసిస్తున్నారు.

Telugu Aftab Purewal, Dipenkhambhaita, Ambassadornicky, Johnsonville, Tea Jay-Te

కాగా.డిపెన్ ఖంబైటా బాటలోనే తాజాగా ఇండో టిబెటెన్ జాతీయుడు అఫ్తాబ్ పురేవాల్ కొత్త చరిత్ర సృష్టించాడు.ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు.తద్వారా ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా అప్తాబ్ రికార్డు సృష్టించాడు.38 ఏళ్ల అఫ్తాబ్ ఒక శరణార్థ టిబెటన్ తల్లి, ఒక భారతీయ తండ్రికి జన్మించాడు.మేయర్ ఎన్నికలలో తన ప్రత్యర్ధి డేవిడ్ మాన్‌ను అఫ్తాబ్ ఓడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube